రోజా పై బిగుస్తున్న ఉచ్చు .... 

Roja To Suspend Permanantly From Assembly

03:44 PM ON 22nd December, 2015 By Mirchi Vilas

Roja To Suspend Permanantly From Assembly

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా ను ఏడాది పాటు సస్పెండ్ చేయడంపై, వైసిపి రగడ చేస్తూ , అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించగా. మరోవైపు టిడిపి మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. అంతేకాదు వైసిపి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే, ఇదే అదనుగా టిడిపి ఈ సమావేశాలను మరింత అనుకూలంగా మలచుకుంది.

వ్యూహాత్మకంగా టిడిపి వ్యవహరించడం ద్వారా, రోజా తీరుని ఎండగట్టింది. రోజా మాట్లాడిన మాటలకు అసలు సస్పెండ్ కాదు , ఏకంగా అనర్హత వేటు వేయాలని టిడిపి మహిళా ఎం ఎల్ ఎ లు డిమాండ్ చేస్తున్నారు. అసలు అలాంటి మహిళను పోటీకి అనుమతించరాదని అంటున్నారు. కేసు కూడా పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ మాట ఎలా వున్నా, ఆమె పై ఇంకా ఉచ్చు బిగుసుకునేలా వుంది. మంగళవారం శాసన సభలో టిడిపి మహిళా ఎం ఎల్ ఎ లు ఆవేదనతో చేసిన ప్రసంగాలు రోజా మరిన్ని చిక్కుల్లో పడనుంది.

రోజా వ్యాఖ్యలపై కంట తడి పెట్టిన అనిత .....

'నాపై రోజా అనుచితంగా చేసిన వ్యాఖ్యలకు రెండు రోజులుగా తాను ఇంట్లో నుంచి బయటకు రాలేకపోయా. నేను చాలా ఇబ్బంది పడేలా రోజా మాట్లాడారు. తీవ్ర మనోవేధనకు గురయ్యా. నేను దళితురాలిని అయినందువల్లే నన్ను టార్గెట్ చేశారు ' అంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనిత మంగళవారం నాడు శాసన సభలో కంటతడి పెట్టారు. హ్యాండ్ కర్చీఫ్‌తో కన్నీళ్లు తుడుచుకున్నారు. అంతలా కంటతడి పెట్టడంతో అక్కడున్న శాసన సభ్యులందర్నీ కదిలించింది. దళిత మహిళనైన తన పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజా పైన సరైన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని అనిత విజ్ఞప్తి చేశారు.

రోజా తన పైన చేసిన వ్యాఖ్యలే.. జగన్ కుటుంబ సభ్యులను అంటే ఆయన ఎంత బాధపడేవారని అనిత వ్యాఖ్యానించారు. మాటలతో చెప్పలేని విధంగా తనను రోజా దూషించారని, అసలు రోజా వ్యాఖ్యలపై ఎలా స్పందించాలో అర్థంకాక, తాను రెండు రోజుల పాటు ఇంటికే పరిమితమయ్యానని, శాసనసభ సమావేశాలకు కూడా హాజరు కాలేకపోయానని ఆవేదన చెందారు. ఒక మహిళ అయి ఉండి కూడా వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా సాటి మహిళపై దారుణ వ్యాఖ్యలు చేయడం అమానుషమన్నారు. ఓ దళిత ఎమ్మెల్యే పైన ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.

పోటీ చేయకుండా చేయాలన్న మంత్రి సుజాత .....

ఎమ్మెల్యే అనితపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రోజా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆమెపై చర్యలు తీసుకోవాలని మంత్రి పీతల సుజాత స్పీకర్‌కు చేతిలెత్తి విజ్ఞప్తి చేశారు. రోజా గతంలో తన పై, అలాగే ఇతరులపై కూడా చాలా జుగుప్సాకరంగా మాట్లాడారని మంత్రి పేర్కొంటూ, ఆమె తీరు తనను తీవ్రంగా బాధించిందని పీతల సుజాత అన్నారు. మనం చట్ట సభలకు వచ్చింది ప్రజల సమస్యలను పరిష్క రించడానికే తప్ప, ఇష్టారీతిగా మాట్లాడేందుకు మాత్రం కాదని ఆమె పేర్కొన్నారు. రోజా వ్యాఖ్యలు ఎవరినైనా తీవ్ర ఆవేదనకు గురి చేస్తాయన్నారు. రోజా మాటలు చూస్తుంటే ఇలాంటి వ్యక్తిని అసెంబ్లీకి పంపించడం ఏమిటనే విధంగా ఉందన్నారు. రోజా మహిళ అనే మరిచిపోయి ఇష్టారీతిన, రౌడీలా మాట్లాడుతోంద ని ఆమె ధ్వజమెత్తారు.

నిన్న తనను (పీతల సుజాత), ఇవాళ అనితను రోజా తిట్టారని, రేపు మరొకరిని కూడా అంటార డంలో సందేహం లేదని మంత్రి పేర్కొంటూ, అలాంటి మహిళను ప్రతిపక్ష నేత జగన్ వెనుకేసుకు రావడం విడ్డూరమన్నారు. రాబోయే రోజుల్లో ఏ మహిళ కూడా ఇలా మాట్లాడకుండా ఉండేందుకు రోజాపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి పీతల సుజాత విజ్ఞప్తి చేశారు. రోజా దళితులను అవమానిస్తున్న, రోజాను పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

English summary

Ysrcp MLA Roja suspended from assembly for her mis behaviour in a.p. assemble. Recently a news came that they were going to disqualify for assembly