మారుతి మళ్లీ బూతు కధలు మొదలెట్టేసావా(వీడియో)

Rojulu Marayi movie teaser

12:24 PM ON 15th June, 2016 By Mirchi Vilas

Rojulu Marayi movie teaser

ఈరోజుల్లో, బస్ స్టాప్ వంటి చిత్రాలతో బూతు చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మారుతి ఆ తర్వాత ఆ బూతు ముద్ర నుండి బయట పడటానికి అల్లు శిరీష్ తో 'కొత్త జంట' అనే లవ్ స్టొరీ తెరకెక్కించాడు. అది అనుకున్నంత స్ధాయిలో ఆడకపోయినప్పటికీ మారుతి పై పడిన బూతు ముద్ర మాత్రం చాలావరకు పోయింది. ఆ తర్వాత నాని హీరోగా తెరకెక్కించిన 'భలే భలే మగాడివోయ్' చిత్రంతో పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని అందించి క్లీన్ ఇమేజ్ సొంతం చేసుకోవడంతో పాటు ఒక్కసారిగా వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక తాజాగా విక్టరీ వెంకటేష్ తో 'బాబు బంగారం' చిత్రం తెరకెక్కిస్తున్నాడు.

అదలా ఉంటే దానితో పాటు 'రోజులు మారాయి' అనే ఓ యూత్ ఫుల్ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే మారుతి అందించాడు. అయితే ఆ చిత్రం టీజర్ చూస్తుంటే యూత్ ఫుల్ గా ఉన్నప్పటికీ బూతులకు మాత్రం డోఖా లేనట్లుగా కనిపిస్తోంది. మరి ఆ చిత్రం రిలీజ్ అయితే కానీ తెలియదు అది యూత్ ఫుల్ చిత్రమా? లేక బూతు చిత్రమా? అనేది.

English summary

Rojulu Marayi movie teaser