మారుతి రోజులు మారాయి భయపెడుతుందా?

Rojulu Marayi movie trailer

10:22 AM ON 20th June, 2016 By Mirchi Vilas

Rojulu Marayi movie trailer

కామెడీ జోడించి తీసే హారర్ సినిమాలు బానే క్లిక్ అవుతున్నాయని ఇటీవల కొన్ని చిత్రాలు నిరూపించాయి. ఇక ఏదో ఒక కొత్త ప్రయోగం చేస్తూనే ఉండే దర్శకుడు మారుతి తన తాజా మూవీని ఓ రియల్ ఇన్సిడెంట్ నేపథ్యంలో రూపొందించాడు. కాస్త కామెడీ, మరి కాస్త రొమాన్స్ కలిపి రోజులు మారాయి అనే ఓ సస్పెన్స్, హారర్ సినిమా తీశాడు. అదే మారుతి టాకీస్, గుడ్ సినిమా గ్రూప్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీలో పార్వతీశం, చేతన్, తేజస్విని, కృతిక హీరో, హీరోయిన్లు. ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా అయిన దిల్ రాజు ఆదివారం ఈ మూవీ ఆడియోను రిలీజ్ చేశాడు.

జూలై 1న రోజులు మారాయి విడుదల కానున్న ఈ చిత్రం మరి ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

English summary

Rojulu Marayi movie trailer