రెగ్యులర్ శృంగారం లేకుంటే ఎన్ని సమస్యలో తెలుసుకోండి

Romance in the Regular Life

12:08 PM ON 30th December, 2016 By Mirchi Vilas

Romance in the Regular Life

మనిషికి అన్నీ కావలి. ఏది ఎంత అవసరమో తెలుసుకుని శృతి మించకుండా చూసుకోవాలి. ఇక శృంగారం అనేది మనిషికి శారీరకంగా, మానసికంగా అవసరం. అంతేకాదు, సెక్స్ రెగ్యులర్ గా చేయడం కూడా చాలా అవసరం. తరుచుగా శృంగారంలో పాల్గొనటం వలన ఎన్ని లాభాలున్నాయి అనే చర్చ ఒక్కరోజులో ముగిసేది కాదు కాని, ఇప్పుడైతే రెగ్యులర్ సెక్స్ లేకపోవడం వలన కలిగే నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అవేమిటో చూద్దాం.

1. శృంగారం రోగనిరోధకశక్తిని పెంచుతుంది అని మనకు తెలిసిందే. అదే శృంగారం రెగ్యులర్ గా లేకపోతే, ఇమ్యునిటి సిస్టమ్ లో మనకు కావాల్సిన మార్పులు జరగవు.

2. నెలకి 20 సార్లు శృంగారంలో పాల్గొంటే ప్రొస్టేటు క్యాన్సర్ ని దూరం చేయవచ్చు అని పరిశోధనలు చెబుతున్నాయి. అదే లేకపోతే, అలాంటి సమస్యే ఉంటే, తేరుకోవడం కష్టమే.

3. పీరియడ్స్ లో క్రాంప్స్ తో చాలా ఇబ్బందిపడతారు అమ్మాయిలు. ఆ క్రాంప్స్ నుంచి ఉపశమనం పొందేందుకు హస్తప్రయోగం చేస్తుంటారు. అదే పార్టనర్ ఉండి, రెగ్యులర్ గా సెక్స్ చేస్తోంటే ఈ క్రాంప్స్ నుంచి ఎప్పటికప్పుడు ఉపశమనం పొందవచ్చు. అదే సెక్స్ లైఫ్ సరిగా లేకపోతే, ఇబ్బందులు తప్పవు.

4. అంగస్తంభనలకి రెగ్యులర్ సెక్స్ కి పెద్ద కనెక్షనే ఉంటుంది. ట్రాక్ తప్పిన శృంగార జీవితం అంగస్తంభన సమస్యలు మోసుకొస్తుంది.

5. భాగస్వాముల మధ్య అనోన్యత తగ్గడం, డిప్రేషన్ లాంటి మానసిక సమస్యలు కూడా చుట్టుముట్టవచ్చు.

6. సెక్స్ డ్రైవ్ తగ్గడం, బరువు పెరగడం ఇంకెన్నో శారీరక సమస్యలు మీ దరి చేరవచ్చు.


ఇది కూడా చూడండి : ఈ వస్తువులు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిలువదట

ఇది కూడా చూడండి : ఈ ఈ రాసుల వాళ్ళు వివాహం చేసుకోకూడదట

ఇది కూడా చూడండి : యాదగిరి గుట్ట నరసింహస్వామి మహిమలు తెలుసా?

English summary

Romance plays importance in regular life. It balances our life Style.