గుండె జబ్బుకు శృంగారమే సరైన మందు!

Romance is the best medicine for heart attack

04:09 PM ON 18th June, 2016 By Mirchi Vilas

Romance is the best medicine for heart attack

అసలు గుండె జబ్బుకు శృంగారానికి సంబంధమేమిటి? అసలు గుండె జబ్బుకి శృంగారం మందేంటి? ఆ రెండింటికి సంబంధమేంటి? దాని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే... ఇప్పుడు మేము చెప్పబోయే విషయం గుండె జబ్బులతో బాధపడేవారికి చాలా అవసరం. గుండు జబ్బులతో బాధపడేవారు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ధూమపానం వదులుకోవాలని, మద్యం తగ్గించాలని ఏ డాక్టరైనా చెబుతారు. అయితే బ్రెజిల్లోని రియో డీ జెనీరియో హార్ట్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్లు మాత్రం గుండె జబ్బుకు కొత్త ఔషధం కనుక్కున్నారు. ఆ ఔషధమే శృంగారం.

వారానికి కనీసం మూడుసార్లు శృంగారం ఉంటేనే గుండెజబ్బుల వారికి మంచిదని ఈ పరిశోధన చేసిన ప్రొఫెసర్ గ్లాడియో గిల్ సొయేర్స్ తెలియజేశారు. భాగస్వామిని ముట్టుకోవడం ఓ నడక లాంటిదని, ముద్దు పెట్టుకోవడం వడివడిగా నడవడం లాంటిదని, శృంగారంలో పాల్గొనడం పరుగెత్తడం లాంటిదని ఆయన చెప్పారు. నడవడం, పరుగెత్తడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో శృంగారం వల్ల కూడా అన్ని ప్రయోజనాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇక ఆరు నిమిషాల పాటు సెక్స్ లో పాల్గొంటే గుండెతోపాటు శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుందని, 21 క్యాలరీలు కరిగిపోతాయని ఆయన చెప్పారు.

సెక్స్ కు, గుండెకు ఉన్న సంబంధం పై జరిపిన 150 అధ్యయనాలను పరిశీలించడం ద్వారా తానీ అభిప్రాయానికి వచ్చానని ఆయన చెప్పారు. ఇక ఈ పరిశోధన ద్వారా గుండె జబ్బులతో పాల్గొనేవారు శృంగారంలో పాల్గోవడం ప్రమాదకరమన్న అభిప్రాయం తప్పని ఋజువైంది. ఈ పరిశోధనలో గుండె జబ్బులు ఉండి శృంగారంలో పాల్గోవడం ద్వారా చనిపోయింది కేవలం రెండు శాతం మాత్రమే అని.. అది కూడా నడవడం లాంటి అలసటను కూడా తట్టుకోలేని వారే మరణించారని ఆయన అన్నారు. సందేహాలున్న వారు వైద్యుల సలహాను తీసుకొని శుభ్రంగా శృంగారంలో పాల్గొనవచ్చని ఆయన చెప్పారు. గుండె జబ్బుగల వారు వయగ్రా వాడడం కూడా మంచిదేనని ఆయన అన్నారు.

English summary

Romance is the best medicine for heart attack