స్కూల్ పిల్లలకు శృంగార పాఠాలు..

Romantic education for school children

12:06 PM ON 13th June, 2016 By Mirchi Vilas

Romantic education for school children

స్కూలు పిల్లలకు వాళ్ళ సిలబస్ లో సెక్స్ ఎడ్యుకేషన్ ను కూడా చేర్చాలన్న ప్రతిపాదన మళ్ళీ తెర పైకి వచ్చింది. నేషనల్ కరిక్యులమ్ లో దీన్ని కూడా భాగంగా చేర్చాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ యోచిస్తోందట. సెక్సువాలిటీ, రీ-ప్రొడక్టివ్ హెల్త్ వంటి అంశాల పై స్టూడెంట్స్ కు బేసిక్ నాలెడ్జ్ ఉండాలని ఈ శాఖ కొంతకాలంగా భావిస్తోంది. సుమారు దశాబ్ధం పాటు దీని పై కసరత్తు చేసింది. తమ ప్రతిపాదనను వచ్చే వారం ఈ శాఖ మానవ వనరుల మంత్రిత్వశాఖ ముందు ఉంచుతుందని అంటున్నారు. కానీ ఇది అమలులోకి వచ్చేముందే దీని పై దేశంలో పెద్దఎత్తున చర్చ జరగవచ్చునని భావిస్తున్నారు.

సెక్స్ ఎడ్యుకేషన్ అన్నది మంచి ఆలోచనే అయినా ఇది మన సంప్రదాయక కుటుంబ విలువలకు తగదని, విద్యార్థుల్లో చెడు భావనలకు ఆస్కారం కల్పిస్తుందని కొందరు రాజకీయ నేతలతో సహా అనేకమంది పేరెంట్స్ అంటున్నారు. అయితే దీని పై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. స్కూళ్ళలో దీన్ని ప్రవేశపెట్టేలా ఈ మాడ్యూల్ ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(పూనే), డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ ఫేర్ కలిసి రూపొందించాయి. దీన్ని నిరభ్యంతరంగా అమలు చేయవచ్చునని సైంటిస్టులు అంటుంటే, ఈ దేశంలో ఇలాంటిది నిషిద్ధమని, ఈ ఆలోచన హేతుబద్ధంగా లేదని విద్యార్థుల తలిదండ్రులు, టీచర్లు కూడా అభిప్రాయపడుతున్నారు.

అయితే సెక్స్ ఎడ్యుకేషన్ ను తప్పనిసరి చేయాలని ఢిల్లీలోని 81 శాతం మంది పేరెంట్స్ కోరుతున్నారని వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజీ నిర్వహించిన సర్వేలో తేలింది. టీనేజీ ప్రెగ్నెన్సీ, లైంగిక వ్యాధులు, డ్రగ్స్, హెచ్ఐవీ, ఎయిడ్స్, పిల్లల లైంగిక వేధింపు వంటి సమస్యల పరిష్కారం కోసం సెక్స్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో దీన్ని అమలు చేసేముందు టీచర్లకు కూడా అవగాహన కల్పించాలని, ఇందుకు తగినట్టే ఈ మాడ్యూల్ రూపొందించామని ఐసిఎంఆర్ లోని సోషల్ బిహేవియర్ రీసెర్చ్ డివిజన్ హెడ్ డాక్టర్ ఎ.ఎస్.కుంద్ చెబుతున్నారు.

వల్గారిటీ లేకుండా ఈ ఎడ్యుకేషన్ ఉండాలని ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు. దీన్ని సెక్స్ ఎడ్యుకేషన్ అనకుండా ఎడాలెసెంట్ రీ-ప్రొడక్టివ్ అండ్ సెక్సువల్ హెల్త్ ఎడ్యుకేషన్ అని మార్చాలని హెల్త్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ సెక్రెటరీ, ఐసిఎంఆర్ డీజీ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ సూచించారు. ఏది ఏమైనా విద్యా సంస్థల్లో ఇలాంటి సెన్సిటివ్ సబ్జెక్ట్ ప్రవేశపెట్టే ముందు ఇంకా లోతైన చర్చకు ఆస్కారం ఇవ్వాలని పలువురు అంటున్నారు.

English summary

Romantic education for school children