రొమాంటిక్ రాజు నిత్యం తన 40 మంది భార్యలతో అలా చేసేవాడట..!

Romantic King spent time with his 40 wives differently

11:15 AM ON 1st February, 2017 By Mirchi Vilas

Romantic King spent time with his 40 wives differently

ఒకప్పుడు రాజుల పాలన సాగేది. రాజు తలచుకుంటే ఆ పని అయిపోవాల్సిందే. చరిత్రలో చూసుకుంటే కొందరు రాజులు ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ శత్రువులతో పోరాడి తమ రాజ్యాన్ని కాపాడుకోవడమే కాదు, ప్రజలకు సుభిక్షమైన పాలన అందించారు. ఇక రసిక రాజులు సరేసరి. ఏదైనా రాజ్యానికి మహారాజు అంటేనే అతనికి అన్ని వైభోగాలు ఉంటాయి. అందుకే రాజ భోగం అనే పేరు కూడా వచ్చింది. కానీ కొందరు రాజులు మాత్రం అలా కాదు. నిత్యం భోగ లాలసులై సుఖాల మధ్య జీవనం సాగిస్తూ ప్రజలను నిర్లక్ష్యం చేశారు. ఇంచుమించు అలాంటి కోవకు చెందినవాడే. ఓ రాజు వున్నాడు. అయితే ఇతగాడు మరీ అంత విలాస పురుషుడు కాదు, ప్రజలకు చెప్పుకోదగిన కార్యక్రమాలు కూడా కొన్ని చేశాడు. కానీ… వ్యక్తిత్వం పరంగా మాంచి రొమాంటిక్! వివరాల్లోకి వెళ్తే,

అతని పేరు కిషన్ సింగ్. రాజస్థాన్‌ను పరిపాలించాడు. 1899 అక్టోబర్ 4న జన్మించి మార్చి 27, 1929న మరణించాడు. అయితే ఇతనికి 40 మంది భార్యలు ఉండేవారు. ఈ క్రమంలో ఆ రాజు తన భార్యలతో అత్యంత రొమాంటిక్‌గా గడిపేవాడు. తన ప్యాలెస్‌కు దగ్గర్లోనే అత్యంత రహస్య ప్రదేశంలో ఓ కొలను (స్విమ్మింగ్ పూల్) నిర్మింపజేసుకున్నాడు. దానికి 20 మెట్లను చందనం కర్రతో అమర్చాడు. ఆ మెట్లపై మెట్టుకు ఇద్దరు చొప్పున మొత్తం 40 మంది భార్యలు నగ్నంగా అటు, ఇటు కొవ్వొత్తులు పట్టుకుని నిలబడే వారు. వారి మధ్య నుంచి కిషన్ సింగ్ రాజు నగ్నంగా ఆ కొలనులోకి అడుగు పెట్టేవాడు. ఆ సమయంలో ఆ కొలను చుట్టు పక్కల ఎవరిని ఉంచేవాడు కాదు. దానికి తోడు వెలుగు కోసం ఉండే కాగడాలను కూడా ఆర్పేవాడు. భార్యలు చేత పట్టుకుని ఉన్న క్యాండిల్ వెలుగులో అతను నడుచుకుంటూ కొలనులోకి దిగేవాడు.

అయితే కొలనులోకి అతను దిగాక ఒక్కో భార్యను కొలనులోకి తోసేవాడు. అలా తోసే క్రమంలో కొవ్వొత్తులు కింద పడకూడదు. అంతేకాకుండా, కొలనులోకి దిగాక కూడా వారందరూ కొవ్వొత్తులు పట్టుకుని నృత్యం చేయాలి. ఆ రాజును అలరించాలి. అయితే ఎవరి చేతిలోనైతే కొవ్వొత్తి పడిపోకుండా చివరి వరకు ఉంటుందో వారితోనే రాజు ఆ రోజు రాత్రి గడిపేవాడట. అయితే ఈ కార్యక్రమం కేవలం ఒక రోజు కాదు. రోజూ జరిగేది. అలా రాజు ఓ వైపు భార్యలతో కొలనులో నగ్నంగా స్నానం చేస్తూనే మరో వైపు అలాంటి వింతైన పోటీలు పెట్టేవాడట. ఈ విషయాలన్నింటినీ ఆ రాజు దగ్గర దివాన్‌గా పనిచేసిన జరమణి దాస్ తన మహారాజా పుస్తకంలో వివరించాడు. ఏది ఏమైనా కిషన్ సింగ్ రాజు రొమాంటిక్ ఫెలోనే కదా..!

ఇది కూడా చూడండి: సమంతా ప్రేమకథ చీర ... ఎలా తయారు చేశారో తెలుసా?

ఇది కూడా చూడండి: ఎవరైనా కోపంతో అరిస్తే ... వెంటనే వారి నోట్లో చక్కెర వేయండి

English summary

there was a romantic king named Kishan belongs to Rajasthan he had 40 wives daily he bath with his wives very differently.