దుర్గగుడి లడ్డూల్లో అధికారుల భాగోతం.. ప్రసాదం గదులు సీజ్

Rooms were seized at Durga temple

03:24 PM ON 3rd October, 2016 By Mirchi Vilas

Rooms were seized at Durga temple

భక్తుల విశ్వాసాలను కాపాడడంలో ఎండోమెంట్స్ అధికారులు సక్రమంగా వ్యవహరించడం లేదన్న ఆరోపణలకు తార్కాణంగా విజయవాడ దుర్గగుడిలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి వెలుగుచూసింది. భక్తులకు పంపిణీ చేస్తున్న లడ్డూలపై ఈగలు, కీటకాలు వాలుతున్న విషయం వెలుగుచూసింది. అధికారుల డొల్లతనంతో 50 వేల లడ్డూలు పంపిణీకి పనికి రాకుండా పోయాయి. ఓ వైపు సీఎం చంద్రబాబు పరిసరాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్న దుర్గగుడి సిబ్బంది మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటిగా కనకదుర్గ దేవాలయానికి పేరుంది.

భక్తులు ఎంతో ప్రీతిపాత్రంగా భావించే లడ్డూ ప్రసాదాల్లో పురుగులు రావడం, లడ్డూలపై ఈగలు, కీటకాలు, బొద్దింకలు వాలడం సర్వసాదారణమయింది. లడ్డూల తయారి తర్వాత వాటిని ఆరబోయడానికి నిల్వ ఉంచే ప్రదేశం అపరిశుభ్ర వాతావరణంలో ఉండడాన్ని మీడియా బట్టబయలు చేసింది. ఇక లడ్డూల భాగోతాన్ని ఓ భక్తుడు ఫుడ్ ఇన్ స్పెక్టర్ కు ఫిర్యాదు చేశారు. తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. దీంతో ఫుడ్ ఇన్ స్పెక్టర్ ఎ.ఎస్.రెడ్డి లడ్డూ తయారీ కేంద్రాన్ని సందర్శించి, శాంపిల్స్ తీసుకుని ల్యాబ్ కు పంపించారు. ఆ లడ్డూలను స్వీకరిస్తే ఫుడ్ పాయిజన్ అవుతుందని భావించిన ఫుడ్ ఇన్ స్పెక్టర్ లడ్డూలను ఉంచిన గదులను సీజ్ చేశారు.

English summary

Rooms were seized at Durga temple