పెద్దల సభకు ద్రౌపది...

Roopa Ganguly came to assembly

04:24 PM ON 5th October, 2016 By Mirchi Vilas

Roopa Ganguly came to assembly

మహాభారత కాలంనాటి ద్రౌపది ఇప్పుడు రావడమేమిటి అనుకుంటున్నారా? అయితే ఈ ద్రౌపది ఎవరో వివరాల్లోకి వెళ్లాల్సిందే. నటి, బీజేపీ నాయకురాలు రూపా గంగూలీ పెద్దల సభకు నామినేట్ అయ్యారు. గత జూలైలో మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆ స్థానంలో రూపా గంగూలీని రాజ్యసభకు బీజేపీ నామినేట్ చేసింది. ఈ ఏడాది పశ్చిమబెంగాల్ నుంచి బీజేపీ టిక్కెట్ పై రూపాగంగూలీ పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఇంతకీ విషయం ఏమంటే, 49 ఏళ్ల రూపా గంగూలీ 1988లో మెగా టీవీ సీరియల్ మహాభారతంలో ద్రౌపది పాత్ర పోషించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.

అనంతరం పలు హిందీ, బెంగాలీ చిత్రాల్లోనూ ఆమె నటించారు. గత ఏప్రిల్ లో మోదీ సర్కార్ సుబ్రమణ్య స్వామి, నరేంద్ర జాదవ్, నవజ్యోత్ సింగ్ సిద్ధు, సురేష్ గోపి, స్వపన్ దాస్ గుప్తా, మేరీ కోమ్ లను రాజ్యసభకు నామినేట్ చేసింది. ఆల్ వరల్డ్ గాయత్రి పరివార్ అధినేత ప్రణవ్ పాండ్యను గత మేలో నామినేట్ చేయగా ఆయన అందుకు నిరాకరించారు. ఆయన స్థానంలో ప్రభుత్వం సంభాజీ రాజేను రాజ్యసభకు పంపింది. గత జూలైలో నవజ్యోత్ సింగ్ సిద్దూ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి అవాజ్-ఇ-పంజాబ్ అనే కొత్త ఫ్రంట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే.

English summary

Roopa Ganguly came to assembly