సారా వద్దన్న రోశమ్మ ఇక లేదు

Rosamma dubagunta passed away

11:01 AM ON 8th August, 2016 By Mirchi Vilas

Rosamma dubagunta passed away

1994 ఎన్నికల ముందు ఉవ్వెత్తున సాగిన సారా వ్యతిరేక ఉద్యమానికి ఊతమిచ్చిన ఉద్యమకారిణి దూబగుంట రోశమ్మ ఇక లేదు. కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న ఆమె ఆదివారం తెల్లవారుజామున కన్ను మూసింది. ఆమె వయస్సు 93 సంవత్సరాలు. నెల్లూరు జిల్లా జలదంకి మండలం దూబగుంటకు చెందిన ఈమె అసలు పేరు వర్దినేని రోశమ్మ. 1991లో సొంత ఊరి నుంచే సారా వ్యతిరేక ఉద్యమం ప్రారంభించిన ఈమె పేరు దూబగుంట రోశమ్మగా స్థిరపడిపోయింది. కొందరు మహిళలతో కలిసి రోశమ్మ మొదలుపెట్టిన సారా వ్యతిరేక ఉద్యమం సంపూర్ణ మద్యపాన వ్యతిరేక ఉద్యమంలా రాష్ట్రమంతటా, వైరస్ లా వ్యాపించింది.

చివరకు మధ్య నిషేధం ఎన్నికల నినాదంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయి అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ఇచ్చిన హామీ మేరకు 1995లో మద్యపానాన్ని నిషేధించారు. నాటి సిఎం దివంగత ఎన్టీఆర్ కూడా రోశమ్మను ప్రశంసించారు. అయితే, 1996లో చంద్రబాబు ప్రభుత్వం మద్య నిషేధం ఎత్తేసిందనుకోండి.

English summary

Rosamma dubagunta passed away