రఫ్‌ డైరెక్టర్‌ చేతిలోకి మారిన 'రుద్రాక్ష'!

Rough movie director new movie is Rudraksha

05:31 PM ON 18th December, 2015 By Mirchi Vilas

Rough movie director new movie is Rudraksha

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌తేజ్‌ తో కృష్ణవంశీ తెరకెక్కించిన 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం వచ్చి దాదాపు సంవత్సరం నర అయిపోయినా ఇంతవరకు తనకొత్త సినిమా గురించి అనౌస్స్‌ చేయలేదు. చాలా గ్యాప్ తీసుకుని అనుష్క తో ఒక లేడీ ఓరియెంటెడ్‌ ''రుద్రాక్ష'' అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు కృష్ణవంశీ ఇటీవలే తెలియజేశాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆది, రకుల్‌ప్రీత్‌ సింగ్‌తో 'రఫ్' చిత్రాన్ని తెరకెక్కించిన సిహెచ్. సుబ్బారెడ్డి ఈ చిత్రానికి 'రుద్రాక్ష' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసి ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేశారు.

ముగ్గురు ప్రముఖ కధానాయికలు, పాపులర్‌ హీరోస్‌తో ఈ చిత్రం తెరకెక్కిచబోతుందని సమాచారం. 24 క్రాఫ్ట్స్‌ పతాకం పై అడ్డంకి రవికాంత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటిస్తారు. అయితే ఇప్పుడు కృష్ణవంశీ అనుష్కతో తెరకెక్కించబోతున్న చిత్రానికి వేరే టైటిల్‌ను రిజిష్టర్‌ చేయించుకోవాల్సి ఉంది.

English summary

Rough movie director new movie is Rudraksha. Ch. Subba Reddy is directing this film.