వాయు ” గండం” -' రోవాన్' తుఫాన్

Rovaan Thoofan

01:34 PM ON 9th November, 2015 By Mirchi Vilas

Rovaan Thoofan

తుఫాన్ ముంచుకొస్తోంది. కొత్తగా వస్తున్న తుఫాన్ కి రోవాన్ అని నామకరణం చేసారు. ... ఎపి , తమిళనాడు తీరప్రాంతాలలో ఎలర్ట్ అయ్యారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా కొనసాగుతూ, మరింత బలపడి మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా, రాత్రికి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. చెన్నైయ్‌కు ఆగ్నేయంగా 320 కిలోమీటర్లు, పుదుచ్చేరి తూర్పు ఆగ్నేయంగా 345 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయింది. ఈ రాత్రికి చెన్నై కరేకల్ దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 70 నుంచి80 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. వాయుగుండం ప్రభావంతో తమిళనాడు అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నై రోడ్లు చెరువుల్లా మారాయి.

చెన్నై సహా ఏడు జిల్లాల్లోని పాఠశాలకు అధికారులు సెలవు ప్రకటించగా, ఏపీలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దక్షిణ కోస్తాలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలోని పలు ప్రైవేటు స్కూళ్లకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. తమిళనాడులో 150మత్స్య కార గ్రామాలను ఖాళీ చేయించి , సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక ఎపిలోని కావలి సముద్ర తీరంలో 7గురు మత్స్యకారులు గల్లంతవ్వగా రేస్క్యు టీం వారిని రక్షించింది. కాగా దీపావళి పండుగపై తుఫాన్ ముసురు కమ్మింది. ఇక కోతకొచ్చిన పంట ఏమౌతుందోనని రైతులు దిగాలు పడుతున్నారు.

English summary

Rovaan Thoofan