రోజాపై రౌడీ షీట్‌ ఓపెన్‌ చేయాలన్న సోమిరెడ్డి

Rowdy Sheet Should Be Open On Roja Says MLC Somireddy

02:57 PM ON 8th March, 2016 By Mirchi Vilas

Rowdy Sheet Should Be Open On Roja Says MLC Somireddy

ఇప్పటికే సిఎమ్ చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ కి గురైన వైసీపీ ఎమ్మెల్యే, నటి రోజా ఇంకా ఫైర్ బ్రాండ్ గా తన విమర్శల జోరు కొనసాగిస్తోంది. ఇటీవలే చినబాబు లోకేష్ పై బుసకోడుతున్న వానపాము అంటూ కామెంట్ చేయడంతో పాటూ సిఎమ్ పై కూడా విరుచుకుపడింది. ఇంకా పలు సందర్భాల్లో విమర్శలు కొనసాగిస్తోంది. ఈ నేపధ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పందిస్తూ, రోజా నోటికి వచ్చినట్లు ఇష్టానుసారం మాట్లాడుతోందని, ఆమె వాడుతున్న భాష వల్ల రౌడీ షీట్‌ ఓపెన్‌ చేయాలని, రోజాను పదవి కాలం మొత్తం శాసనసభ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. బజారు రౌడీలు కూడా అలా మాట్లాడరని ఆయన పేర్కొంటూ, మహిళలు రోజాకు బుద్ధి చెప్పాలన్నారు. ప్రజాప్రతినిధి అయిన రోజా మహిళాలోకం సిగ్గుతో తలదించుకునేవిధంగా ప్రవరిస్తున్నారని మండిపడ్డారు. రోజాకు ఏడాది బహిష్కరించినా బుద్ధిరాలేదని ఆయన పేర్కొంటూ, ఆమెను ఐదేళ్లపాటు అసెంబ్లీకి రాకుండా బహిష్కరించాలని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు సోమిరెడ్డి విజ్ఞప్తి చేసారు.

English summary

Telugu Desam Party MLC Somireddy Chandra Mohan Reddy fires on Ysr Congress party leader Roja for doing controversial comments on Chandra Babu Naidu and Nara Lokesh.He says that Rowdy Sheet Should be open on Roja for her worst behavior and she should be suspended for five years from assembly.