పబ్ లో బౌన్సర్లపై రౌడీల దాడి(వీడియో)

Rowdy sheeters followers attacked pub bouncers in Hyderabad

04:59 PM ON 30th September, 2016 By Mirchi Vilas

Rowdy sheeters followers attacked pub bouncers in Hyderabad

పబ్ లలో రౌడీల ఆగడాల గురించి గతంలో చాలా విన్నాం. తాజాగా హైదరాబాద్ సిటీలో చోటుచేసుకున్న ఘటనలో బౌన్సర్ల పై రౌడీలు సాగించిన దాష్టీకం బయట పడింది. జూబ్లీహిల్స్ లోని కాక్ టేల్ పబ్ లో గురువారం రాత్రి కొందరు యువకులు ఓ రేంజ్ లో వీరంగం సృష్టించారు. పబ్ ను తెరవాలంటూ ఓ రౌడీషీటర్ అనుచరులు బౌన్సర్లపై దాడికి దిగారు. అర్ధరాత్రి దాటిన తర్వాత పబ్ తెరిచేందుకు అనుమతిలేదని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. పబ్ క్లోజ్ చేశామని, ఇప్పుడు ఓపెన్ చేయడం కష్టమని చెప్పడంతో, రౌడీ అనుచరులు మరింత రెచ్చిపోయారు. బౌన్సర్లను చితకబాదారు. అందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇది.

English summary

Rowdy sheeters followers attacked pub bouncers in Hyderabad