సిరివెన్నెలకు ఈసారి కూడా అన్యాయమే

RP Patnaik fights with Government over Padma Awards

04:34 PM ON 28th January, 2017 By Mirchi Vilas

RP Patnaik fights with Government over Padma Awards

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో కొంతమందికి చోటు లభిస్తే, కొంతమందికి మళ్ళీ మొండిచేయి అయింది. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే, ఈ సారి కూడా ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి చోటు దక్కక పోవడం పట్ల సంగీత దర్శకుడు, నటుడు ఆర్పీ పట్నాయక్ తనదైన రీతిలో సోషల్ మీడియా ద్వారా వాపోయాడు.

దశాబ్దాలుగా తెలుగు సినిమాకు సాహిత్య సేవ చేస్తున్న సిరివెన్నెలకు పద్మ అవార్డుల విషయంలో అన్యాయం జరుగుతోందని, ఆయన్ను ప్రభుత్వాలు గుర్తించక పోవడం తనను తీవ్ర నిరాశకకు గురి చేసిందని ఆర్పీ పట్నాయక్ వ్యాఖ్యానించాడు.

తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా ఎందుకు చేస్తున్నాయో అర్థం కావడం లేదు, కనీసం సిరివెన్నెల సీతారామశాస్త్రి పేరును కూడా పద్మ అవార్డులకు ప్రతిపాదించలేదు. నన్ను టోటల్ గా డిసప్పాయింట్ చేసింది. ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు వినిపించే వరకు గొంతు కలుపుదాం. నా వాదన రైట్ అనిపిస్తే మీడియా వారు కూడా మాతో జాయిన్ అవ్వండి అంటూ' అని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు. .

ఇది కూడా చూడండి: 4 రోజుల్లో బరువు తగ్గడానికి సూపర్ చిట్కా

ఇది కూడా చూడండి:

English summary

RP Patniak critices AP government to give Padma Sri award to senior lyricist Sirivennela Seetharam sastri but even not nominated him in the list.