దిమ్మ తిరిగే బంపర్ ఆఫర్ ఇస్తున్న ఆర్టీసీ

RTC provides amazing Offer

12:34 PM ON 8th June, 2016 By Mirchi Vilas

RTC provides amazing Offer

ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి వచ్చే పోటీని తట్టుకుని నిలబడడానికి ఇప్పటికే ఎన్నో ఆఫర్లతో దూసుకెళుతున్న ఏపీఎస్ ఆర్టీసీ తాజాగా దిమ్మతిరిగే మరో ఆఫర్ ను ప్రకటించింది. వెనుక సీట్లను ముందుగా బుక్ చేసుకున్న వారికి ప్రత్యేక రాయితీ సౌకర్యం.. అమరావతి బస్సుల్లో సీటుకో టీవీ సౌకర్యం లాంటి కార్యక్రమాలతో దూసుకెళుతున్న ఆర్టీసీ.తాజాగా ఇస్తున్న మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ వాలెట్ నుంచి టికెట్ కొనుగోలు చేసిన వారికి ప్రయాణ ఛార్జీలో పది శాతం రాయితీ లభిస్తుంది. దీంతో.. ఏపీఎస్ ఆర్టీసీ యాప్ డౌన్ లోడ్ చేసుకున్న వారికి మరిన్ని ప్రయోజనాలు చేకూరనున్నాయి.

ఆర్టీసీ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నాక రూ.100 టికెట్ విలువ ప్రయాణికుడి ఖాతాలో జమ కానుంది. యాప్ ద్వారా టికెట్లను కొనుగోలు చేసేందుకు వీలుగా ఈ వాలెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సౌకర్యం సోమవారం నుంచి అందుబాటులోకొచ్చింది. ఈ వాలెట్ లో కొంత మొత్తాన్ని జమ చేయటం ద్వారా, తమకు అవసరమైన టికెట్లను కొనుగోలు చేసినప్పుడు సదరు వాలెట్ లో ఉన్న మొత్తంతో టికెట్ కొనుగోలు చేసే వీలు కలుగుతుంది. ఈ వాలెట్ ద్వారా టికెట్ కొనుగోలు చేసే వారికి టికెట్ విలువలో 10 శాతం రాయితీ కల్పిస్తోంది. దీనికి అదనంగా యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వారికి 24 గంటల వ్యవధిలో టికెట్ రద్దు చేసే సౌకర్యాన్ని కూడా ఆర్టీసీ కల్పించనుంది. ఇక ఏపీఎస్ ఆర్టీసీ యాప్ ను మీ మొబైల్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకోవటం అవసరమే కదా.

ఇది కూడా చూడండి: 6వేల మంది బట్టలిప్పేసి నిరసన

ఇది కూడా చూడండి: మన క్రికెటర్ల చిన్నప్పుడు ఎంత ముద్దుగా ఉన్నారో

ఇది కూడా చూడండి: మనదేశంలో తప్పక చూడవలసిన ఆదర్శ గ్రామాలు ఇవే

English summary

RTC provides amazing super bumper Offer.