గుణశేఖర్ మామూలోడు కాదు!!

Rudhramadevi movie sequel updates

11:49 AM ON 8th January, 2016 By Mirchi Vilas

Rudhramadevi movie sequel updates

తెలుగు సినిమా పరిశ్రమలో మొదటి 3డి హిస్టారికల్‌ సినిమా రుద్రమదేవి. ఈ సినిమా కాకతీయ రాజవంశాన్ని పరిపాలించిన రాణి రుద్రమదేవి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన అనుష్క, అల్లు అర్జున్‌, రాణా కృష్ణంరాజు, బాబా సెహగల్‌, నిత్యమీనన్‌, కేధరీన్‌ ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో కనిపించారు. ఈ సినిమాకు దర్శకుడు గుణశేఖర్‌. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సినిమా చివరి లో 'ప్రతాపరుద్రుడు' అనే పేరును హైలేట్‌ చేయడం గమనించారు. ప్రతాపరుద్రుడు రుద్రమదేవి కొడుకు అని అందరికీ తెలిసిందే. అయితే ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసే విధంగా డైరెక్టర్‌ గుణశేఖర్‌ రుద్రమదేవి సీక్వెల్‌ గా 'ప్రతాపరుద్రుడు' సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో హిరో అల్లు అర్జున్‌ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను ఈ ఏప్రిల్‌ లో మొదలు పెట్టేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. అల్లు అర్జున్‌ రుద్రమదేవి సినిమాకు ఎటువంటి రెమ్యూనిరేషన్‌ తీసుకోలేదు. ఇది డైరెక్టర్‌ గుణశేఖర్‌ కు పెద్ద ప్లస్‌ అయింది.దీనికి కృతజ్ఞతగా గుణశేఖర్‌ 'ప్రతాపరుద్రుడు' లో హీరోగా అల్లు అర్జున్‌ కి అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా, అల్లు అర్జున్‌ బోయపాటి తో చేస్తున్న సరైనోడు సినిమా పూర్తయిన తరువాత ప్రారంభం కానుంది.ఎంతో రిస్క్ చేసి మరీ రూపొందించిన రుద్రమదేవి విడుదల విషయంలో గుణశేఖర్ నిజంగా ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నప్పటికీ సినిమాను విడుదల చేసి ఔరా అనిపించుకున్నాడు. ఇప్పుడు మరో అతి పెద్ద సాహసానికి గుణశేఖర్ పూనుకోవడంతో గుణశేఖర్ మామూలోడు కాదని సినీ జనాలు ముక్కున వేలేసుకుంటున్నాయి.

English summary

All the viewers who watched this historical epic drama would have noticed the title prataparudrudu on the end cards of rudhramadevi movie.