సమంత రెండేళ్ల క్రితమే కోడలిగా ఫిక్స్ అయిందా?

Rumours On Samantha And Naga Chaitanya At The Time Of Manam

10:32 AM ON 6th September, 2016 By Mirchi Vilas

Rumours On Samantha And Naga Chaitanya At The Time Of Manam

టాలీవుడ్ లో సమంత పేరు ఇప్పుడు బ్రాండ్ అయిపోయింది. సినిమాల కన్నా వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె వివాహానికి అక్కినేని కుటుంబంతో కలిసి హాజరవడం ఆమెపై వస్తున్న వార్తలకు మరింత ఊతమిచ్చింది. ఇక నాగార్జునే స్వయంగా సమంతను, చైతన్యను సచిన్ కు పరిచయం చేశారు. ఆయన సమంతను ఏ వరుసతో పరిచయం చేసుంటారో వేరే చెప్పక్కర్లేదేమో కదా. అసలు చైతు - సమ్మూల పెళ్ళికి నాగ్ ఓకే చెప్పడం లేదని కూడా కొన్ని రూమర్స్ షికారు చేశాయి.

అయితే నిమ్మగడ్డ కూతురి పెళ్లిలో పెళ్లికాని కపుల్ ను చూసి అక్కినేని వారి కోడలు సమంతే అని కొందరు సినీజనాలు గుసగుసలాడుతున్నారు. అయితే అక్కినేనివారి కోడలిగా సమంత రెండేళ్ల క్రితమే ఫిక్సయిందని జోస్యం తెలిసిన వారిలా మరికొందరు చెబుతున్నారు. అయితే వీళ్ళు ఇలా చెప్పడానికి కూడా ఓ సాక్ష్యం ఉందట.

మూడుతరాల అక్కినేని వైభవం ఒకే ఫ్రేమ్ లో చక్కగా ఒదిగిపోయిన ‘మనం’ సినిమాలో నాగచైతన్య భార్యగా సమంత నటించిన విషయం తెలిసిందే. 2014లో వచ్చిన ఈ ఫాంటసీ డ్రామా ఫిల్మ్ టాలీవుడ్ లోనే ‘మూడు తరాల’ మొదటి చిత్రం. ఈ సినిమా షూటింగ్ అప్పుడే చైతూ-సమంత పెళ్లిపై అక్కినేని ఫ్యామిలీ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది . అక్కినేని నాగేశ్వర రావు ఉండగానే ఈ యవ్వారం తేల్చేశారని అంటున్నారు. అయితే ఇప్పుడు సినీ కధలా తంతు నడుస్తోందని అంటున్నారు. ఇంతకీ మనం చిత్రంలో నాగార్జునకు తల్లిగా సమంత, ఏఎన్నార్ కు తల్లిగా శ్రియా నటించారు. శ్రియా పాత్రలో అమల నటించుంటే.. ‘మనం’ సినిమా పూర్తిస్థాయి అక్కినేని కుటుంబ చిత్రం అయి ఉండేదని సినీజనాలు ఊహించి చెబుతుండడం మరో విశేషం.

ఇది కూడా చూడండి: మేకప్ లేకుండా మన హీరోయిన్స్‌ను చూడలేం !!!

ఇది కూడా చూడండి: మగవాళ్ళు గడ్డం పెంచితే ఏమవుతుందో తెలుసా?

ఇది కూడా చూడండి: దిమ్మతిరిగే పచ్చి నిజాలు

English summary

Rumours On Samantha And Naga Chaitanya At The Time Of Manam