షాహిద్ అఫ్రిదీ కూతురుపై పుకార్లలో నిజమెంత?

Rumours On Shahid Afridi Daughter Death

11:29 AM ON 29th April, 2016 By Mirchi Vilas

Rumours On Shahid Afridi Daughter Death

పుకార్లు షికారు చేసినపుడు అందులో నిజమెంతో నిగ్గు తేల్చడం కత్తిమీద సామే. అయినా ఓ ప్రయత్నం జరిగితీరాలి. ఇంతకీ ఇదంతా ఎందుకంటే , పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రీది కూతురుకు చెందిన ఓ వార్త ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది. ఆమె చనిపోయిందని చెబుతూ ఓ ఫోటోను ఆన్‌లైన్‌లో పెట్టారు. ఇది ఇప్పుడు వైరల్ అయింది. గులాబీ రంగు దుస్తుల్లో ఉన్న ఆ బాలిక పై, గులాబీ పూలు పరిచారు. అది చనిపోయినట్లుగా ఉంది. ఈ ఫోటో కొద్ది రోజులుగా ఇంటర్నెట్లో చక్కెర్లు కొడుతుండగా, ఇవన్నీ వట్టి పుకార్లేనని అంటున్నారు. ఇందుకు సంబంధించి అసలు నిజం మరోలా ఉంది. మూడు వారాల క్రితం షాహిద్ అప్రిదీకి చెందిన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశాడు. తన కూతురు ఆసుపత్రిలో ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు. అంతేకాదు, 'గెట్ వెల్ సూన్ అమ్సారా' అని పోస్ట్ చేశాడు. అమ్సారా అఫ్రీది కూతురు.

ఇవి కూడా చదవండి: తనతో పెళ్ళికి ఒప్పుకోలేదని కారులోనుంచి తోసేశాడు

అయితే, ఏప్రిల్ 25వ తేదీ నుంచి అమ్సారా క్యాన్సర్‌తో చనిపోయిందని పుకార్లు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఓ వీడియోను నెట్లో పోస్ట్ చేశారు. ఓ వైపు ఆమె చనిపోయిందంటూ పుకార్లు నెట్లో హల్‌చల్ చేస్తుండగా, ఆమె మాత్రం ఆసుపత్రిలో సర్జరీ చేయించుకుందని తెలుస్తోంది. అంతేకాదు, ఆమె బాగా రికవరీ అయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమెపై పుకార్లు షికారు చేస్తున్నాయి. నిజం నిగ్గు తేల్చాలి మరి.

ఇవి కూడా చదవండి: క్షుద్ర పూజలు చేస్తూ దొరికేసిన హీరోయిన్

ఇవి కూడా చదవండి: మగాడ్ని రేప్ చేసి దాన్ని ఎత్తుకెళ్ళారు(వీడియో)

English summary

Recently A rumours came that Pakistan Batsman Shahid Afridi's daughter was died due to cancer in Pakistan. But afridi posted a pic of his daughter by saying that she was recovering soon in Hospital.