సెకండ్ మూవీకే వంద కోట్ల బడ్జెట్ ..

Run raja run director sujith to direct prabhas

11:04 AM ON 30th June, 2016 By Mirchi Vilas

Run raja run director sujith to direct prabhas

‘రన్ రాజా రన్’ తో టాలీవుడ్ కి పరిచయమైన డైరెక్టర్ సుజిత్, ఇప్పటివరకు ఇంకో ప్రాజెక్ట్ ఏమీ చేయలేదు. అయితే ప్రభాస్ ప్రాజెక్ట్ పైనే కంప్లీట్ గా ఫోకస్ పెట్టాడు. బాహుబలి 2 షూట్ ఫినిష్ కాగానే.. ప్రభాస్ తో సెట్స్ మీదకు సుజిత్ వెళ్తాడట. ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ దాదాపు 100 కోట్లని అంటున్నారు.

నార్మల్ గా టాలీవుడ్ లో 100 కోట్లతో మూవీ చేయాలంటే స్టార్ డైరెక్టర్లను హీరోలు అప్రోచ్ అవుతారు. కానీ సెకండ్ మూవీని ఆ రేంజ్ లో ఎలా చేయబోతున్నాడంటూ ఇండస్ర్టీలో చర్చ మొదలైంది. రాజమౌళి లాంటి డైరెక్టర్లకే 100 కోట్లతో మూవీ చేయడానికి చాలాటైం పట్టేసిందని, అలాంటిది సుజిత్ కు ఎలా సాధ్యమైందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడిపోతున్నాయి.

దక్షిణాది భాషల్లో చేస్తున్నప్పుడు ఆ మాత్రం ఇన్వెస్ట్ మెంట్ తప్పదన్నది ప్రభాస్ ఫ్యాన్స్ వాదన గా ఉందట. ఇక్కడే కొంతమంది ఓ విషయాన్ని రివీల్ చేస్తున్నారు. బాహుబలి మార్కెట్ ని కంటిన్యూ చేయాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాల్సిందేనన్నది యూవీ క్రియేషన్స్ ఆలోచనట. అందుకే ఇలా ఖర్చు చేస్తుందని అంటున్నారు. బడ్జెట్ ఓకే.. స్టోరీ ఎలా వుంటుంది? అయినా అంత సాహసం ప్రభాస్ ఎలా చేస్తున్నాడు? లాంటి ప్రశ్నలు వస్తున్నాయి కూడా. వీటికి సమాధానం లేకున్నా భారీ బడ్జెట్ పైనే మోజు పెంచేసి కుంటున్నారు. కొంపదీసి రేపు జరరాణి డిజాస్టర్ జరిగితే ఇక అంతే సంగతులు. ఇదంతా ఎందుకంటే కీడు ఎంచి మేలంచమని అంటారు కదా. పైగా ఇటీవల సర్దార్ , బ్రహ్మోత్సవం చూసాక అయినా, కనువిప్పు కలగక పోతే ఎవరు మాత్రం ఏమి చేస్తారు.

ఇది కూడా చూడండి: రామాయణ కాలం నాటి లంక లో అబ్బురపరిచే అంశాలు

ఇది కూడా చూడండి: మహాభారతంలో పరీక్షితుడు గురించి మీకు తెలుసా!

ఇది కూడా చూడండి: ఈ ఫస్ట్ ఎయిడ్ టిప్స్ తో ప్రాణాలు కాపాడుకోవచ్చు

English summary

Pabhas will start shooting for his new Telugu film will direct Sujith.