రూ. 500, 1000 నోట్లు రద్దు..

Rupees 500 and 1000 notes were banned

11:07 AM ON 9th November, 2016 By Mirchi Vilas

Rupees 500 and 1000 notes were banned

మొత్తానికి ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా నల్లధనం నిరోధానికి కఠిన చర్యలు చేపట్టారు. అందుకే మంగళవారం అర్థరాత్రి నుంచి రూ.500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. అయితే డిసెంబరు 30లోగా రూ.500, రూ.1000నోట్లు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపారు. ఈనెల 11 వరకు వైద్యసేవలు, రైలు టికెట్ల కోసం రూ.500, రూ.1000 నోట్లు వినియోగించుకోవచ్చని ప్రధాని వెల్లడించారు. డిల్లీ నుంచి జాతినుద్ధేశించి ప్రసంగించిన ప్రధాని ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. డిసెంబరు 30లోపు డిపాజిట్ చేయనివారు.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం 2017 మార్చి 31లోగా డిపాజిట్ చేయవచ్చని తెలిపారు.

నల్లధనం, అవినీతి కబంధ హస్తాల్లో దేశం చిక్కుకుపోయింది. అధికార దుర్వినియోగంతో అనేకమంది భారీ సంపద కూడగట్టారు.. నిజాయతీ పరులు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. సాధారణ పౌరుడు అత్యంత నిజాయితీతో జీవిస్తున్నాడు.. అధికారం అనుపానులు తెలిసినవాళ్లే అవినీతికి పాల్పడతున్నారు. ఉగ్రవాద సంస్థలు రూ.500, రూ.1000 దొంగనోట్లను చెలామణి చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తున్నాయి. అవినీతిపరుల ఆటకట్టించేందుకు బినామీ ఆస్తుల చట్టాన్ని తీసుకొచ్చాం. సబ్ కా సాథ్- సబ్ కా వికాస్ అన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

1/12 Pages

1. నవంబర్ 8 అర్ధరాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్లు రద్దు అయ్యాయి. ప్రభుత్వం ఇకపై వాటిని ముద్రించదు.

English summary

Rupees 500 and 1000 notes were banned