ఆ నోట్లను చించేశారు... ఎందుకో తెలుసా?

Rupees 500 and 1000 rupees notes teared

11:14 AM ON 14th November, 2016 By Mirchi Vilas

Rupees 500 and 1000 rupees notes teared

రూ. 500, రూ. 1000 పెద్దనోట్లను రద్దు చేయడంతో అక్రమార్కులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. రకరకాల యత్నాలు చేస్తున్నా పూర్తిగా ఫలితం రాకపోవడంతో కొందరు నదుల్లో, కాలువల్లో నోట్లు పారేస్తుంటే.. మరికొందరు ప్రజలకు పంచేస్తున్నారు. కొన్నిచోట్ల నోట్లను చించి చెత్తకుప్పల్లో పారబోస్తున్నారు. అలాంటి ఘటనే కోల్ కత్తాలో చోటు చేసుకుంది. కోల్ కత్తాలోని గోల్ఫ్ క్లబ్ ఏరియాలో రహదారి పక్కన మూడు బస్తాల రూ. 500, రూ.1000 నోట్లను దుండగులు చించి పారబోసి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం ఈ నోట్లను చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.

రాత్రి ఎవరో ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వాటిని సంచుల్లో నింపి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నోట్లను చూసేందుకు పలు ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇలా పారేసే బదులు తమకు ఇవ్వచ్చు కదా అని స్థానిక పేదవారు ఆశగా అడుగుతున్నారు. ఇంకా ఇలాంటి విచిత్రాలు ఎన్నో చూస్తాం మరి.

1/4 Pages

కారులోంచి వెయ్యినోట్లు విసిరేస్తూ వెళ్ళారంట...


తాజాగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల(చిన్న తిరుపతి) లో గుర్తుతెలియని వ్యక్తి కారులో వెళ్తూ వెయ్యి రూపాయల నోట్లను రోడ్డుపై విసురకుంటూ పోయాడు. అదే టైంలో అటుగా వెళుతున్న కొందరు వాటిని తీసుకోవడానికి పరుగులు తీశారు. ఎస్వీఎస్ ఫంక్షన్ హాల్ సమీపంలోని ఒక మెకానిక్ షెడ్డు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ద్వారకాతిరుమల నుంచి భీమడోలు వైపు వెళుతున్న సదరు వ్యక్తి ఇలా దాదాపు రూ.లక్షకు పైగా విలువైన వెయ్యి రూపాయల నోట్లను రోడ్డుపైకి విసిరేసి ఆగకుండా వేగంగా వెళ్లిపోయాడు. దీంతో వాటిని ఏరుకునేందుకు రోడ్లపై వెళ్తోన్న వ్యక్తులు ఎగబడ్డారు. అప్పనంగా వచ్చిన సొమ్ము గనుకే ఇలా చేస్తున్నారని పలువురు వ్యాఖ్యానించారు.

English summary

Rupees 500 and 1000 rupees notes teared