భార్యని ముక్కలు చేసి.. ఆపై పెట్రోల్ పోసి ..

Rupesh Agarwal killed his wife in hyderabad

11:46 AM ON 5th July, 2016 By Mirchi Vilas

Rupesh Agarwal killed his wife in hyderabad

బెట్టింగ్ లు మనుషుల జీవితాలను రోడ్డున పరుస్తున్నాయి. ఇక షేర్ మార్కెట్ కుప్పకూలిపోతే వచ్చే అనర్ధాలు కూడా చెప్పనలవి కాదు. ఇదిగో స్టాక్ మార్కెట్ దెబ్బ కారణంగా ఓ కుటుంబంలో చిచ్చు రేపింది. ఎనిమిదేళ్లపాటు సజావుగా సాగిన కాపురంలో స్టాక్ మార్కెట్ నష్టాల కారణంగా ఆ భార్యభర్తల మధ్య విభేదాలు పొడచూపాయి. ఆవేశం ఆలోచనను చంపేసింది. చివరకు భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలు చేసి పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈ ఘటననుంచి తప్పించుకునే క్రమంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. కూతురు అనాధ అయింది. సంచలనం రేపిన ఈ ఘటన హైదరాబాద్ శివారు ప్రాంతమైన మదన్ పల్లిలో చోటుచేసుకుంది.

సికింద్రాబాద్ లోని పద్మారావునగర్ లో వుంటున్న ఆగ్రా వాసి రూపేశ్ అగర్వాల్ ఎనిమిదేళ్ల కిందట సౌతాఫ్రికాలోని కాంగో దేశానికి చెందిన 35 ఏళ్ల సింతియాను ప్రేమించి మ్యారేజ్ చేసుకున్నాడు. వీళ్లకి సానియా అనే 7 ఏళ్ల పాప కూడా వుంది. ప్రస్తుతం గచ్చిబౌలిలో అద్దెకు వుంటున్నారు. కొద్దికాలం కిందట రూపేశ్ కొంతమొత్తాన్ని స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాడు. దీంతో అతడు నష్టాల పాలయ్యాడు. ఈ వ్యవహారమే భార్యభర్తల మధ్య చిచ్చుపెట్టడమేకాదు.. విభేదాలు తారాస్థాయికి చేరుకోవడం కూడా జరిగిపోయింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భార్యతో గొడవపడ్డాడు. ఆగ్రహంతో ఆమె గొంతునులిమి చంపేశాడు రూపేశ్. శవాన్ని ముక్కలుగా చేసి ఓ పెద్ద బ్యాగులో పెట్టాడు. ఎలాంటి వాసన రాకుండా స్ర్పే కొట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా సోమవారం ఉదయం స్కూల్ లో కూతుర్ని విడిచిపెట్టాడు.

సాయంత్రం స్కూల్ నుంచి సానియా వచ్చాక బ్యాగ్ లోని చెత్తను కాల్చేసి వద్దామంటూ శంషాబాద్ శివారులోని మదన్ పల్లికి రాత్రి 8 గంటల కు ఫోర్డ్ కారులో కూతురితో కలిసి వచ్చాడు. కూతుర్ని కొద్దిదూరంలోనే దించేసి కారును ముందుకు తీసుకెళ్లి అందులోని బ్యాగ్ లోవున్న భార్య మృతదేహాన్ని బయటకు తీసి, వెంట తెచ్చుకున్న పెట్రోలు పోసి తగులబెట్టాడు. తిరుగు ప్రయాణంలో మదన్ పల్లి శివారులో కారు బురదలో కూరుకుపోయింది. ఈలోగా స్థానికులు అక్కడకు వెళ్లి ఆరా తీయగా రూపేశ్ కంగారుతో వున్నట్లు కనిపించాడు..

అంతేకాదు పొంతన లేని సమాధానాలు చెప్పడం, ఇంకోవైపు మంటలు కనిపిస్తుండడంతో స్థానికులు శంషాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాలిపోతున్న మృతదేహాన్ని గుర్తించారు. దీంతో నిందితుడితోపాటు అతడి కూతుర్ని స్టేషన్ కు తరలించి విచారణ మొదలుపెట్టారు. ఈ దారుణంపై స్థానికులు దిగ్భ్రాంతి కి గురయ్యారు.

సింథియా హత్య కేసులో మారుతున్న ట్విస్ట్

కాగా భర్త చేతిలో దారుణహత్యకు గురైన 36 ఏళ్ల సింధియా గురించి కొత్తకొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివాహేతర సంబంధమే భార్యాభర్తల మధ్య గొడవకు కారణమైనట్టు తాజా కధనం. కొద్దిరోజుల కిందట ఫేస్ బుక్ ద్వారా ఫ్రెంచ్ యువకుడితో సింధియాకు రిలేషన్ ఏర్పడిందని, అది కాస్త ప్రేమగా మారి చివరకు మ్యారేజ్ వరకు దారితీసిందనట్టు తేలింది. ఈ యవ్వారం గురించి ఆమె భర్త రూపేశ్ చెవిలోపడింది. ఐతే, భర్త రూపేశ్ నుంచి విడాకులు తీసుకునేందుకు సింథియా ఎంతగానో ప్రయత్నాలు చేసిందట. అసలు భార్యభర్తల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడానికి ఇదే కారణమైనట్టు సమాచారం. దీనికితోడు పాపను కూడా తనతోపాటే తీసుకెళ్తానని సింథియా పట్టుపట్టినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఓవైపు పాప, మరోవైపు విడాకుల వ్యవహారం భార్యాభర్తల మధ్య చిచ్చు రేగింద ని అంటున్నారు.

ఇది కూడా చూడండి: మన క్రికెటర్ల చదువు ఎంతో తెలుసా.?

ఇది కూడా చూడండి: ఇలాంటి అమ్మాయిలని అబ్బాయిలు పెళ్లి చేసుకోరట

ఇది కూడా చూడండి: భారత్ లో అంతుచిక్కని రహస్యాలు

English summary

Rupesh Agarwal killed his wife in hyderabad.