రష్యన్‌ యువతిపై వారణాసిలో యాసిడ్‌ దాడి

Russian woman injured in Varanasi

06:15 PM ON 13th November, 2015 By Mirchi Vilas

Russian woman injured in Varanasi

వారణాసిలో ఒక రష్యన్‌ యువతిపై యాసిడ్‌ దాడి జరిగింది. ఈ దుర్ఘటన వివరాలలోకెళితే మూడురోజుల క్రితం రష్యానుండి వారణాసి చూడడానికి వచ్చిన 23 సంవత్సరాల రష్యన్‌ యువతి దార్యయురేవా స్థానికంగా నివసించే హృదయ్‌లాల్‌ శ్రీవాత్సవ్‌ అనే వ్యక్తి ఇంట్లో పేయింగ్‌ గెస్ట్‌గా ఉంటోంది. గత మూడునెలల క్రితం కూడా వచ్చిన ఈ యువతి ఇదే వ్యక్తి ఇంట్లో బసచేసినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా తన పాస్‌పోర్ట్‌ గడువు త్వరలోనే ముగియనుండడంతో వచ్చిన మూడు రోజులకే తిరిగి వెళ్ళిపోవాలని ప్రయత్నించింది. కానీ ఆ ఇంట్లో నివసిస్తున్న హృదయ్‌లాల్‌ మనవడు సిద్ధార్ధ్‌ అనే యువకుడు యువతిని పెళ్ళి చేసుకుంటానని కోరగా దానికి నిరాకరించడంతో ఈ దాడికి తెగించినట్లు పోలీసులు చెబుతున్నారు.

English summary

Russian woman injured in Varanasi.Russian woman injured in Varanasi she is came from Russia