విదేశీ కోడలికి స్వదేశీ అత్త టార్చర్ ..

Russian woman strike against her mother in law

11:06 AM ON 11th July, 2016 By Mirchi Vilas

Russian woman strike against her mother in law

'పుట్టింటోళ్ళు తరిమేశారు ... కంటుకున్నోడు వదిలేసాడు' ఆ మధ్య వచ్చిన సరదా పాట ఏమో గాని, నిజంగా ఓ అత్త తన కోడలిని తరిమేసిందట. పోనీ మనదేశం కోడలు కూడా కాదు. ఇది చూస్తుంటే, ఈ దేశంలో పరాయి దేశపు కోడళ్ళకూ అత్తల నుంచి వేధింపులు తప్పవని అనిపించక మానదు. ఓల్గా ఎఫిమెంకోవా అనే రష్యన్ మహిళ ఉదంతమే ఇందుకు నిదర్శనం. ఉత్తర ప్రదేశ్ కు చెందిన విక్రాంత్ సింగ్ చందేల్ అనే వ్యక్తి 2011 లో ఓల్గా ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆగ్రా లో వీరి పెళ్లి జరిగింది. కొంతకాలానికి ఈ దంపతులకు కూతురు పుట్టినప్పటి నుంచి ఓల్గా కు అత్త నిర్మల చందేల్ నుంచి టార్చర్ మొదలైంది. అదనపు కట్నం కోసం తరచూ తనను ఆమె వేధిస్తూ వస్తోందని, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని ఓల్గా అంటోంది. చివరకు తన అత్త మామలు తనను ఇంటి నుంచి గెంటి వేశారని వాపోయింది.

అయితే ఈ విదేశీ కోడలు పిల్ల తనను ఇంట్లోకి రానివ్వాలని, తనకు న్యాయం జరగాలని చిన్నారి కూతురితో సహా ఓల్గా ఆ ఇంటి బయట మౌన పోరాటానికి దిగేసింది. ఆహారం కూడా ముట్టనని చెబుతున్న తన భార్యకు ఆమె భర్త విక్రాంత్ సింగ్ కూడా అండగా నిలబడ్డాడు. 11 లక్షల కట్నం సొమ్ము కోసం తన తల్లి ఈమెను వేధిస్తోందని అతడు ఆరోపిస్తున్నాడు. ఇప్పుడు నా దగ్గర కూడా చిల్లిగవ్వ లేదని చెబుతున్నాడు. అయితే ఇతని తల్లి వాదన వాదన చూస్తుంటే, 'నేను ఒకేఒక గదిలో ఉంటున్నా, నా ఆస్తిని నా కూతురికి రాసిచ్చేశా. నా కొడుకు, కోడలు నా బాగోగులు పట్టించుకోవడం లేదు' అని ఆరోపిస్తోంది. ఈ కుటుంబ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మొత్తానికి స్వదేశీ విదేశీ అనే తేడా లేకుండా అత్తా కోడళ్ల మధ్య రాద్ధాంతం బానే సాగుతోంది.

ఇది కూడా చూడండి: ఇద్దరి మధ్యా కుదిరింది సయోధ్య

ఇది కూడా చూడండి: స్త్రీలు చేసేవి చేయకూడనివి

ఇది కూడా చూడండి: రష్యన్ హెలికాప్టర్ ఐసిస్ కూల్చేసింది

English summary

Russian woman strike against her mother in law. Her mother in law torture for dowry so Russian woman sits on hunger strike.