ర్యాన్‌ రెనాల్డ్స్‌ను అంతగా బాధ పెట్టిందేటి?

Ryan Reynolds About The Failure OF Green Lantern Movie

10:17 AM ON 17th February, 2016 By Mirchi Vilas

Ryan Reynolds About The Failure OF Green Lantern Movie

ఈ మధ్యనే తాను నటించిన ‘గ్రీన్‌ లాంటెర్న్‌’ చిత్రం ఊహకందని నిరాశ మిగల్చడంతో, ఇబ్బంది ఫీలవుతున్న హాలీవుడ్ స్టార్ ర్యాన్‌ రెనాల్డ్స్‌ కి మళ్ళీ పంట పండుతున్నట్లే వుండడం సంతోషం కల్గిస్తోందట. అయితే ఓ బాధ మాత్రం వెంటాడుతూనే వుండట. ఇప్పుడు నటించిన ‘డెడ్‌పూల్‌’ చిత్రానికి వస్తున్న ఆదరణ చూస్తుంటే, అనూహ్యమయిన కలెక్షన్లను సంపాదించుకునే అవకాశాలే అధికమని పరిశ్రమ అంచనా వేస్తోంది.

‘డెడ్‌పూల్‌’ చిత్రంలో ర్యాన్‌ రెనాల్డ్స్‌, ‘వేడ్‌ విన్‌స్టన్‌ విల్సన్‌’గా నటించారు. రచయితలు ఫేబ్‌ నిసీజా, రాబ్‌ లైఫీల్డ్‌లు సృష్టించిన ‘మార్వెల్‌’ కామెడీ సిరీస్‌లో యాంటీహీరో రూపం దాల్చిన ఈ మ్యుటెంట్‌ హీరో చిత్రానికి టిమ్‌ ముల్లర్‌ దర్శకత్వం వహించాడు. ఇంతకీ ఈ హీరోకి ఈ చిత్రం హిట్‌ అయి తీరాల్సిన అవసరం ఉండడం, అందుకనుగుణంగా హిట్ రావడం శుభ పరిణామంగా భావిస్తున్నారు.

అంతకుముందు నటించిన ‘గ్రీన్‌ లాంటెర్న్‌’ చిత్రం అపజయం పొందడంతో ‘ఆయన మంచి నటుడే, కానీ ఏం లాభం? అతను ఆ సినిమా స్క్రిప్ట్‌ను పూర్తిగా చదివి మరీ ఒప్పుకుని ఉండాల్సింది’ అని కూడా ఒక సన్నిహితుడు వ్యాఖ్యానించడం ర్యాన్‌ రెనాల్డ్స్‌ను చాలా బాధ పెట్టేసిందట. అది అలానే వెంటాడుతోంది. ‘అంటే, నేను స్క్రిప్ట్‌లను కూడా చదవనని అతని ఉద్దేశ్యం అయి ఉండవచ్చు... కానీ అది చాలా తప్పు! నేను ఏ స్క్రిప్ట్‌నైనా క్షుణ్ణంగా చదివాకే , ఒప్పుకుంటా . లేదంటే ఆ పాత్రను ఒప్పుకోను. అయినా ఒక సినిమా విఫలమయితే, దానికి సవా లక్ష కారణాలు ఉంటాయన్నది తెలిసిందే.’ అంటూ, తన పాత్ర స్వల్పమేనని భావిస్తున్నట్లు ర్యాన్‌ రెనాల్డ్స్‌ చెబుతూనే వున్నాడు. మరి ఈ హీరో గారి బాధ అలాంటిది.

English summary

Hollywood Hero Ryan Reynolds said about his film that Despite finally getting to play Deadpool next year, Ryan Reynolds is still in the shadow of his last superhero role: Green Lantern.