సంగీతానికి థమన్ గుడ్ బై!

S S Thaman saying good bye to music

04:02 PM ON 19th April, 2016 By Mirchi Vilas

S S Thaman saying good bye to music

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'బాయ్స్' చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన థమన్ ఆ తర్వాత అనూహ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయి, మాంచి దూకుడు మీద ముందుకు సాగిపోతున్నాడు. వాస్తవానికి తొలి సినిమాతో అనుకున్నంత విజయం అందుకోలేక పోయినప్పటికీ చిత్రంలో నటించిన సిద్ధార్థ్ కి, థమన్ కి గుర్తింపు బానే వచ్చింది. ఇక ఈ సినిమా చూసిన అందరూ థమన్ నటుడిగా కొనసాగి బిజీ అవతాడని ఊహించనప్పటికీ రివర్స్ అయింది. నటుడిగా బిజీ అవ్వడం పక్కన పెట్టి అనుకోని విధంగా సంగీత దర్శకుడై అందరిని ఆశ్చర్య పరిచాడు ఈ బొద్దు నటుడు.

'భీభత్సం' చిత్రంతో సంగీత దర్శకుడిగా మారిన థమన్ అక్కడ నుండి ఎద తెరిపి లేకుండా సినిమాలు చేస్తూ అటూ తమిళ్ తో పాటు ఇక్కడ తెలుగులోనూ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా విరాజిల్లుతున్నాడు. సంవత్సరానికి దాదాపు 3,4 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తూ బిజీ అయిపోయిన థమన్ నటన లైట్ తీసుకున్నాడని అనుకున్నారు. కాని తాజా గా ఈ మ్యూజిక్ డైరెక్టర్ నటన పై దృష్టి పెట్టాడు. త్వరలోనే బాయ్స్ కి సీక్వెల్ గా తెరకెక్కనున్న 'బాయ్స్-2' చిత్రం లో నటించడానికి థమన్ సిద్ధమయ్యాడు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంతో దర్శకుడు అట్లీ దగ్గర అసోసియేట్ గా చేసిన వ్యక్తి దర్శకుడు కాబోతున్నాడు.

మరి ఈ బొద్దు మ్యూజిక్ డైరెక్టర్ కి మ్యూజిక్ పై ఆసక్తి తగ్గిందో? లేదా నటన పై మళ్ళీ ఆసక్తి పెరిగిందో? నటిస్తూనే ఇతర చిత్రాలకి మ్యూజిక్ అందిస్తాడో? లేక కొన్ని నెలలు మ్యూజిక్ కి గుడ్ బాయ్ చెబుతాడో? నటుడుగా బిజీ గా మారిపోయి, మ్యూజిక్ కి దూరమవుతాడో... మొత్తానికి టాలీవుడ్ లో దీని పై రకరకాల టాక్ వినిపిస్తోంది.

English summary

S S Thaman saying good bye to music. Tollywood top most music director S.S. Thaman is saying good bye to music and he is acting in Boys sequeal.