బండ్లను సెల్లో వేయిస్తానన్న సచిన్

Sachiin Joshi Warning To Bandla Ganesh

07:07 PM ON 11th March, 2016 By Mirchi Vilas

Sachiin Joshi Warning To Bandla Ganesh

అగ్ర హీరోలతో సినిమాలు తీస్తూ రఫ్ ఆడిస్తున్న నిర్మాత బండ్ల గణేష్‌కు  కొన్ని రోజుల క్రితం హీరో సచిన్ జోషి వార్నింగ్  ఇచ్చాడట. అదీ ఆషామాషీగా కానే కాదు. ఏకంగా  జైల్లో పెట్టిస్తానని , నీవు సినిమాలు తీస్తే వాటిని ఆడనివ్వనని  సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడట.   బండ్ల గణేష్ పుట్టిన రోజు సందర్భంగా సచిన్ జోషి ట్విట్టర్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా  మారి  ప్రకంపనలు సృష్టిస్తోంది . ఇటీవల, కొంత విరామం అనంతరం మళ్లీ వరుసగా చిత్రాలు తీసేందుకు బండ్ల గణేష్ సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే, పలువురు హీరోలను డేట్స్ కోసం ఆయన సంప్రదిస్తున్నాడు. అయితే, సచిన్ జోషి ఇచ్చిన వార్నింగ్ నేపథ్యంలో బండ్ల గణేష్ కు కొన్నాళ్ల పాటు దూరంగా ఉండటమే మంచిదని టాలీవుడ్ యువహీరోలు భావిస్తున్నారట.

‘నాకు అత్యంత ప్రియమైన నమ్మకద్రోహి.. బండ్ల గణేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు.. త్వరలోనే నేను నిన్ను జైల్లో కలుస్తా’ అంటూ సచిన్  ట్వీట్ చేశాడు. అలాగే, బండ్ల గణేష్‌ తో సినిమా చేసేందుకు( హీరోలు, దర్శకులను ఉద్దేశించి) ఎవరూ ముందుకు వచ్చినా.. ఆ సినిమా రిలీజ్ అవ్వకుండా తాను చూస్తానని ఆయన  వార్నింగ్ ఇచ్చాడు. బండ్ల గణేష్ చేతిలో మోసపోయిన వారందరూ అతడు జైలు కెళ్లే రోజు కోసం ఎదురుచూస్తున్నారని.. ఆ రోజున అందరూ కచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటారని సచిన్ చెబుతున్నాడు.  కాగా, గతంలో సచిన్ జోషి హీరోగా ‘నీ జతగా నేనుండాలి’ అనే సినిమాను బండ్ల గణేష్ నిర్మించాడు. ఆ సమయంలో వారిద్దరి మధ్య కొన్ని ఆర్థికలావాదేవీలు చోటుచేసుకున్నాయి. సినిమా రిలీజ్ తర్వాత తనకు తప్పుడు లెక్కలు చూపెడుతూ.. తన దగ్గర తీసుకున్న డబ్బును ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నాడని సచిన్ జోషి గతంలో కోర్టుకెక్కాడు. అయితే  సచిన్ జోషి తనపై ఇంత ఘాటు వ్యాఖ్యలు చేసినప్పటికీ బండ్ల గణేష్ ఏమాత్రం స్పందించకపోవడం చూస్తుంటే వీటిని పట్టించుకున్నట్టా, లేనట్టా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

1/4 Pages

కలుద్దాం..

‘నాకు అత్యంత ప్రియమైన నమ్మకద్రోహి.. బండ్ల గణేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు.. త్వరలోనే నేను నిన్ను జైల్లో కలుస్తా’

English summary

On the occasion of tollywood star producer Bandla Ganesh so many celebrities was wished him Happy Birthday but Hero Sachin Joshi warned and fired on Bandla Ganesh by saying that he will meet him in Jail and he wont allow to release his movies