లిమ్కా బుక్‌లో సచిన్‌ బుక్

Sachin autobiography enters into Limca Book Of Records

10:36 AM ON 19th February, 2016 By Mirchi Vilas

Sachin autobiography enters into Limca Book Of Records

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మైదానం వీడినా అతని హవా మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకూ క్రికెట్ తోనే రికార్డులు క్రియేట్ చేసిన సచిన్ ఇప్పుడు తన స్వీయచరిత్రతోనూ హాట్ టాపిక్ అయ్యాడు. అత్యుత్తమ అమ్మకాలు జరిగిన పుస్తకంగా సచిన్ బుక్ నిలిచింది. ఫిక్షన్‌, నాన్‌ ఫిక్షన్‌ విభాగాల్లో అత్యధికంగా అమ్ముడైన పుస్తకంగా సచిన్‌ లైఫ్ హిస్టరీ బుక్ ప్లేయింగ్‌ ఇట్‌ మై వే లిమ్కా బుక్‌లో చోటు దక్కించుకుంది. సచిన్‌ తన క్రికెట్‌ జీవితానికి సంబంధించి రచించిన పుస్తకమే ప్లేయింగ్‌ ఇట్‌ మై వే. 2014 నవంబర్‌ 6న ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పుస్తకం 1,50,289 కాపీలు అమ్ముడయ్యాయి. పుస్తకం ధర రూ.899. ఈ పుస్తకం మొత్తంగా రూ.13.51 కోట్లు వసూలు చేసింది.

English summary

Cricket Legend God Sachin Tendulkars Auto Biography autobiography now holds the Limca Book of Record for the "Best selling Adult Hardback on Release" orders on first day of publication.