నేను అక్కడికి  వెళ్ళనంటున్న సచిన్

Sachin Gives Clarity On The Rumours

10:01 AM ON 26th January, 2016 By Mirchi Vilas

Sachin Gives Clarity On The Rumours

ఈ నెల 29న దుబాయ్‌లో జరుగనున్న ఓ అవార్డులో కార్యక్రమంలో ఎంపీ, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ ముఖ్య అతిథిగా పాల్గొనడం లేదట. పైగా ఇదంతా ఊహాగానాలేనని కొట్టి పారేసాడు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వివరణ ఇచ్చాడు. ‘తాను ఈ నెల 29న భారత్‌లోనే ఉంటున్నానని, ఎలాంటి అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనడం లేదని’ ట్వీట్‌ చేసాడు. తమిళ నటులు బృందాలుగా ఏర్పడి ఆడుతున్న సెలబ్రిటీ బ్యాడ్మింటన్‌ లీగ్‌ పురస్కారాల ప్రదానోత్సవం ఈ నెల 29న దుబాయ్‌లో జరుగబోతోంది. ఈ కార్యక్రమానికి సచిన్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారని వార్తలు రావడంతో ఈ వివరణ ఇచ్చుకున్నాడు.

English summary

Sachin Tendulkar said that he was not participating in the event which was conducting by Tamil actors named celebrity badminton league awards in Dubai.Sachin said this in his twitter account