జనతా గ్యారేజ్ లో 'సచిన్'

Sachin Khedekar in Janatha Garage movie

04:08 PM ON 25th May, 2016 By Mirchi Vilas

Sachin Khedekar in Janatha Garage movie

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం జనతా గ్యారేజ్. శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సినిమాలో ముఖ్యమైన విలన్ పాత్రకు మరాఠీ నటుడు సచిన్ ఖేదేకర్ ని ఎంపిక చేసుకున్నారట. ఈ పవర్ ఫుల్ పాత్రకు సచిన్ అయితే బాగుంటుందని కొరటాల శివ అభిప్రాయమట. అందుకే ఆయన్ని కొరటాల సంప్రదించగానే సచిన్ వెంటనే ఓకే చెప్పేసారట.

అయితే ఈ విషయాన్ని చిత్ర టీం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్స్ చిత్రం పైన భారీ అంచనాలు రేకెత్తించాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు 12న విడుదల కానుంది.

English summary

Sachin Khedekar in Janatha Garage movie