అదరగొడుతున్న 'సచిన్' టీజర్

Sachin movie teaser

02:37 PM ON 14th April, 2016 By Mirchi Vilas

Sachin movie teaser

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకున్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జీవితకథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్‘. జేమ్స్ ఎరికన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సచిన్' చిత్రానికి సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు అన్ని భాషల్లో అనువాదం చేసే అవకాశం ఉంది. సచిన్ తన క్రికెట్ జీవితంలో 200 టెస్టులు, 463 వన్డేలు ఆడి మొత్తం 100 సెంచరీలు చేసి ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఏ క్రికెటర్ సొంతం చేసుకోలేని అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి క్రికెట్ ఫీల్డ్ లో తనదైన ముద్ర వేసిన సచిన్ ఇక చిత్రాల్లో ఎలాంటి హిట్లు కొడతాడనేది అనేది మాత్రం వేచి చూడక తప్పదు.

ఈ టీజర్ బ్యాక్ గ్రాండ్ లో సచిన్ వాయిస్ వినిపించడంతో అభిమానుల ఆనందం కట్టలు తెచ్చుకుంది. ఇక ఇండియా ఆడే ప్రతీ మ్యాచ్ లో కనిపించే సచిన్ వీరాభిమాని ఈ టీజర్ లో కనిపించడం విశేషం. ఈ చిత్రం టీజర్ కొద్దిసేపటి క్రితమే(గురువారం) రిలీజైంది. నిమిషం నిడివిగల టీజర్ లో ఎక్కువగా సచిన్ చిన్నతనం గురించే చూపించాడు డైరెక్టర్. ఈ ఆటగాడి ఫ్యామిలీ, బ్రదర్, గురువు వంటి వారితో కూడిన సన్నివేశాలున్నాయి. మరి ఈ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.


English summary

Sachin movie teaser. Cricket God Sachin Tendulkar life history is as now movie.