బ్రిటీష్ ఎయిర్ వేస్ పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆగ్రహం

Sachin Tendulkar angry on Bristish air ways

06:05 PM ON 14th November, 2015 By Mirchi Vilas

Sachin Tendulkar angry on Bristish air ways

సచిన్‌ టెండూల్కర్‌, ఈ పేరు తెలియని వారుండరు. జాతీయంగా,అంతర్జాతీయంగా ఎన్నో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు, ప్రపంచమంతా ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. అటువంటి దిగ్గజ ఆటగాడికి బ్రిటిష్‌ ఎయిర్‌ వేస్‌లో పరాభవమే ఎదురయింది. అక్కడ సిబ్బంది సచిన్‌ ఎవరని ప్రశ్నించారని సచినే స్వయంగా తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఆయన ఆల్‌ స్టార్స్‌ క్రికెట్‌ టోర్నీ కోసం అమెరికా వెళ్ళారు. విమానంలో తన కుటుంబ సభ్యులకి సీట్లు కేటాయించడంలో బ్రిటీష్ ఎయిర్‌ వేస్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. అంతే కాకుండా తాము నిర్దేశించిన చోటుకి కాకుండా వేరే చోటుకి తమ లగేజి తీసుకెళ్ళారని ఆ విషయం పై అక్కడ సిబ్బందిని ప్రశ్నించగా సచిన్‌ ఎవరని ప్రశ్నించారని ఆ సమయంలో తీవ్ర ఆగ్రహానికి,అసంతృప్తికి లోనయ్యానని సచిన్‌ వ్యాఖ్యానించాడు. ఈ సంఘటనకి బ్రిటీష్ ఎయిర్‌ వేస్‌ వేగంగానే స్పందించి, లగేజి వివరాలు తమ అడ్రెస్‌ చెప్తే అక్కడికి తమ లగేజి పంపిస్తామని సచిన్‌ను క్షమాపణలు కోరారు. ఈ ట్వీట్‌ను చూసిన సచిన్‌ అభిమానులు బ్రిటీష్ ఎయిర్‌ వేస్‌ పై కామెంట్లు చేస్తున్నారు.

English summary

Sachin Tendulkar angry on Bristish air ways, Sachin tendulkar went america for all stars cricket tourney.