సింధుకి రెడ్ కారు ఇచ్చేసిన సచిన్

Sachin Tendulkar gave red car to PV Sindhu

12:08 PM ON 29th August, 2016 By Mirchi Vilas

Sachin Tendulkar gave red car to PV Sindhu

రియో ఒలంపిక్స్ లో రజత పతక విజేత పూసర్ల వెంకట సింధుకి కారు బహుమతిగా ఇవ్వాలని మాజీ క్రికెటర్ చాముండేశ్వరినాథ్ నిర్ణయించడం అది కూడా సచిన్ చేతులమీదుగా ఇవ్వాలని నిర్ణయించడం తెలిసిందే. ఈనేపధ్యంలో ఆదివారం హైదరాబాద్ లోని గోపీచంద్ అకాడెమీలో జరిగిన కార్యక్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దంపతుల చేతులమీదుగా రెడ్ కలర్ బీఎమ్డబ్ల్యూను అందజేశారు. అలాగే కోచ్ గోపీచంద్, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్ లకు కూడా కార్లు అందజేశారు. అనంతరం ఈ నలుగురితో సెల్ఫీ దిగాడు. ఒలంపిక్స్ పతకాలు గెలిచి మన దేశ ప్రతిష్టను మరింత పెంచారని, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని సచిన్ అన్నాడు. ఈ విజయ పరంపర ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించాడు.

షట్లర్ పీవీ సింధు స్పందిస్తూ, ఒలింపిక్స్ తర్వాత ప్రస్తుతం బిర్యానీ, ఐస్ క్రీంలతో ఎంజాయ్ చేస్తున్నానని చెప్పింది. బ్రాండ్ విలువ గురించి పట్టించుకోనన్న సింధు తన దృష్టంతా ఆటపైనే ఉంటుందని, త్వరలోనే ప్రాక్టీస్ మొదలుపెడతానని చెబుతోంది. సచిన్ తన కోసం రెడ్ కలర్ కారు సెలెక్ట్ చేసి, అయన చేతుల మీదుగా కారు అందివ్వడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేసింది. ఇకపై రోజూ అకాడమీకి కారులోనే వస్తానంది.

ఇది కూడా చదవండి: బస్సులో భార్య చనిపోతే.. ఆతర్వాత ఏమైందో తెలుసా(వీడియో)

ఇది కూడా చదవండి: తల్లి శవాన్ని సగం చేసి మడతెట్టేశారు

ఇది కూడా చదవండి: దారుణం.. అత్తమామలే పడకగది దృశ్యాలు చిత్రీకరించి.. ఆపై...

English summary

Sachin Tendulkar gave red car to PV Sindhu. God of cricket Sachin Tendulkar presented red color BMW car to PV Sindhu and another Olympic winners.