సచిన్ కోసం ప్రత్యేక హంగులతో కార్ తాయారు చేసిన బీఎండబ్ల్యూ..

Sachin Tendulkar new bmw car

05:20 PM ON 21st September, 2016 By Mirchi Vilas

Sachin Tendulkar new bmw car

క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ కార్ల జాబితాలోకి కొత్త వాహనం చేరింది. ఎం స్పోర్ట్ ప్యాకేజీ ఉన్న బీఎండబ్ల్యూ 750ఎల్ఐ వాహనాన్ని కొనుగోలు చేశాడు. దీనిని బీఎండబ్ల్యూ ఇండివిడ్యువల్ సచిన్ అభిరుచులకు అనుగుణంగా డిజైన్ చేసింది. ఈ ఏడాదిలో సచిన్ కొనుగోలు చేసిన రెండో కారు ఇది. ఇప్పటికే కస్టమైజ్ చేసిన బీఎండబ్ల్యూ ఐ8ను కూడా మాస్టర్ బ్లాస్టర్ వాడుతున్నాడు. కొత్త తరం బీఎండబ్ల్యూను ఈ ఏడాది ఆటోషోలో సచినే ఆవిష్కరించారు. ఇంజిన్ లోకి గాలివెళ్లి ఇంధన సామర్థ్యం పెంచే విధంగా ఈ కారుకు పెద్ద కిడ్నీ గ్రిల్ ను ఏర్పాటు చేశారు. కొత్త మోడల్ కారుకు లేజర్ లైట్ హెడ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి.

సచిన్ కారుకు ఉన్న ఎం స్పోర్ట్స్ ప్యాకేజీలో కొత్త స్పోర్టీ బంపర్ ను అమర్చారు. 20 అంగుళాల వీస్పోక్ అలాయ్ వీల్స్, ఇక రెండు టెయిల్ ల్యాంప్ లకు క్రోమ్ స్ట్రిప్ ఉంటుంది. ఇక సచిన్ లోగోతో లెదర్ ఇంటీరియర్ ఉన్నాయి. దీనిలో ఐడ్రైవ్ 5.0 ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ఇందులో వుంది. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి కారు తీస్తాడో చూడాలి.

ఇది కూడా చదవండి: టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 10 సినిమాలు

ఇది కూడా చదవండి: కొత్త ఇంటికి గృహ ప్రవేశం చేస్తున్న మాటీవీ

ఇది కూడా చదవండి: ఫ్రీగా ఇంటర్నెట్ కావాలంటే మీ ఫోన్ లో ఈ యాప్స్ ను ఇన్స్టాల్ చేసుకోండి

English summary

Sachin Tendulkar new bmw car. BMW company gave a new car to Sachin Tendulkar.