సింధు కోసం సచిన్ రెడ్ కారు సెలెక్ట్(వీడియో)

Sachin Tendulkar selected red car for PV Sindhu

04:31 PM ON 27th August, 2016 By Mirchi Vilas

Sachin Tendulkar selected red car for PV Sindhu

రియో ఒలంపిక్స్ లో రజత పతక విజేత పూసర్ల వెంకట సింధుకి కారు బహుమతిగా ఇవ్వాలని మాజీ క్రికెటర్ చాముండేశ్వరినాథ్ నిర్ణయించడం అది కూడా సచిన్ చేతులమీదుగా ఇవ్వాలని నిర్ణయించడం తెలిసిందే. ఈనేపధ్యంలో షట్లర్ పీవీ సింధు స్పందిస్తూ, సచిన్ తన కోసం రెడ్ కలర్ కారు సెలెక్ట్ చేశారని తెలిసిందని, ఆయన చేతుల మీదుగా కారు అందుకోవడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేసింది. ఇకపై రోజూ అకాడమీకి కారులోనే వస్తానన్నారు. ఒలింపిక్స్ తర్వాత ప్రస్తుతం బిర్యానీ, ఐస్ క్రీంలతో ఎంజాయ్ చేస్తున్నానని చెప్పారు. బ్రాండ్ విలువ గురించి పట్టించుకోనన్న సింధు తన దృష్టంతా ఆటపైనే ఉంటుందని... త్వరలోనే ప్రాక్టీస్ మొదలుపెడతానని చెబుతోంది.

ఒలింపిక్స్ లో రజత పతకం గెలుచుకున్న సింధుకు బహుమతులు వెళ్లువెత్తుతూనే ఉన్నాయి. మెడల్ గెలిస్తే కారు గిఫ్ట్ ఇస్తానన్న సచిన్ ఆదివారం సింధుకు బహుమతిగా రెడ్ కలర్ బీఎమ్డబ్ల్యూను బహూకరించనున్నారు. సింధు కారును సచిన్ స్వయంగా సెలక్ట్ చేశాడని చాముండేశ్వరినాథ్ చెప్పారు. టోక్యోలో సింధు గోల్డ్ గెలిస్తే హెలికాఫ్టర్ ఇవ్వాలేమో అంటూ ఛలోక్తి విసిరారు. ఇది సింధుకు తానిచ్చే మూడో కారు అని చాముండేశ్వరినాథ్ తెలిపారు. మొత్తానికి నజరానాలా పర్వం జోరుగానే సాగుతోంది.

ఇది కూడా చదవండి: పుట్టబోయే పిల్లలు తెలివిగా, ఆరోగ్యంగా పుట్టాలంటే ఏం చెయ్యాలి?

ఇది కూడా చదవండి: నడిరోడ్డుపై నీలిచిత్రాలు చూస్తూ అడ్డంగా బుక్కయ్యాడు!

ఇది కూడా చదవండి: ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్!

English summary

Sachin Tendulkar selected red car for PV Sindhu. Cricket God Sachin Tendulkar selected new BMW red color car for Olympics champion PV Sindhu.