పాకిస్తాన్ లో ఆడతానన్న  సచిన్

Sachin To Play In Pakisthan

07:04 PM ON 12th November, 2015 By Mirchi Vilas

Sachin To Play In Pakisthan

గతంలో శ్రీలంక క్రికెట్ టీం పై జరిగిన ఉగ్రదాడి తో పాకిస్తాన్ లో క్రికెట్ ఆడేందుకు అసలు ఏ క్రికెట్ జట్టు కుడా ముందుకు రాని సమయంలో సచిన్ పాకిస్తాన్ లో ఆడతాననడం చర్చనీయాంశం అయ్యింది. పాకిస్తాన్ తో క్రికెట్ ఆడేందుకు ఒప్పుకోని బిసిసిఐ సచిన్ తీసుకున్న నిర్ణయాన్ని ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇటివల అమెరికా లో జరుగుతున్న అల్ స్టార్స్ క్రికెట్ లీగ్ లో పాకిస్తాన్ కు చెందిన షొయాబ్ అక్తర్ , వసీం అక్రం , సక్లెయిన్ ముస్తాక్, మోయిన్ ఖాన్ వంటి క్రికెటర్లు ఆడుతున్న విషయం తెలిసిందే. సచిన్ టీంలో ఆడుతున్న షొయాబ్ అక్తర్ సచిన్ పాకిస్తాన్ లో మ్యాచ్ ఆడాలని కోరగా తన ప్రతిపాదనకు సచిన్ సంతోషంగా తప్పకుండా ప్రయత్నిస్తానని చెప్పినట్టు షొయాబ్ అక్తర్ తెలిపాడు. ఐతే ఇది అధికారిక సిరీస్ కాకపోవడంతో సచిన్ కు కేంద్ర ప్రబుత్వ అనుమతి అవసరం లేదని అంతా భావిస్తున్నారు.

English summary

Sachin To Play In Pakisthan