సచిన్ విజయం తనొక్కడిదే కాదు..

Sachin victory not only his own and also his brother and coach

06:46 PM ON 4th December, 2015 By Mirchi Vilas

Sachin victory not only his own and also his brother and coach

ఒకానొక సమయంలో సచిన్‌ అంటే ఎంతో మంది విపరీతమైన అభిమానం చూపించేవారు. ఏ ఆటగాడికీ లేనంత క్రేజ్ సచిన్‌ సొంతం చేసుకున్నాడు అని ఢిల్లీలో జరిగిన మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడీ స్మారక ఉపన్యాసం చేసిన ద్రావిడ్‌ ఈ విధంగా స్పందించాడు. అయితే సచిన్‌ ఈ స్ధాయికి ఎదగడానికి కారణం సచిన్ అన్న, అతని కుటుంబ సభ్యులు మరియు సచిన్‌ కొచే కారణమని ద్రావిడ్ చెప్పాడు. సచిన్‌ కుటుంబం అతనికి ఎల్లప్పడూ అండగా నిలిచేవారని అతని అన్న ఎప్పడూ ఒక తండ్రిలా, స్నేహితుడిలా తన వెన్నంటే ఉండి తన భవిష్యత్తు మార్గనిర్ధేశం చూపేవారు.

సచిన్‌ కోచ్‌ రమాకాంత్‌ అచ్రేకర్‌ క్రికెట్‌ ఆటనే కాదు జీవితాన్ని కూడా నేర్పించారు. సచిన్‌కు బ్యాట్‌ ఎలా పట్టుకోవాలో ఎలా ఆడాలో తనతోనే ఉండి క్రికెట్ పై అవగాహన కల్పించే వారు. అలాంటి కోచ్‌ దొరకడం సచిన్‌ అదృష్టం. అంత ప్రోత్సాహం లేకుంటే సచిన్‌ ఈ స్ధాయికి వచ్చేవాడే కాదంటూ ద్రావిడ్ చెప్పాడు. సచిన్‌ ఎంతో మంది క్రీడాకారులకి స్ఫూర్తి, అంతే కాదు క్రికెట్‌లో సచిన్‌ ఆట ఎంతో స్పెషల్‌. ఒక విధంగా చెప్పాలంటే సచిన్‌ లాంటి ఆటగాడు దొరకడం ఇండియా అదృష్టమని, సచిన్‌ వయసు ఉన్నమాకు అతని ఎదుగదల చూసి మాకు భయమేసేదని, అంతే కాదు టీమిండియాకు సచిన్‌ అందించిన విజయాలు అనంతం అని సచిన్‌ ని పొగడ్తల జల్లుతో ముంచెత్తాడు ద్రావిడ్‌ .

English summary

Dravid says that Sachin victory not only his own and also his brother and coach.