నాగ చైతన్యకు చెంప చెళ్ళు మనిపించిదెవరు?

Sahasam Swasaga Sagipo Trailer

11:39 AM ON 2nd June, 2016 By Mirchi Vilas

Sahasam Swasaga Sagipo Trailer

నాగచైతన్య, గౌతమ్ మీనన్ కాంబినేషన్లో రూపొందిన రెండో చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’ షూటింగ్ మొత్తం పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమౌతున్న నేపధ్యంలో ట్రైలర్ను చైతూ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు. నాగచైతన్య సరసన మంజిమ మోహన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ పతాకంపై కోనవెంకట్ సమర్పణలో మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రూపొందిన ఈ సినిమా ఆడియోని ఈనెలలో విడుదల చేసి.. జూలైలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకీ ట్రైలర్ ఓపెనింగ్లోనే చైతూ హీరోయిన్ చేత చెంపదెబ్బ తింటాడు. ‘లైఫ్లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు..అది జరిగినప్పుడు దాన్ని మనం ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనేదే ముఖ్యం’ అని ట్రైలర్లో చైతూ చెప్పే డైలాగు సినిమాపై ఆసక్తిరేపే విధంగా ఉంది. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా సాంగ్ టీజర్లను ఒక్కక్కటిగా యుట్యూబ్లో రిలీజ్ చేస్తూ వచ్చారు చిత్రయూనిట్. ‘ఎల్లిపోమాకే’ పాటకుగానూ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది.

ఇవి కుడా చదవండి:అ..ఆ.. మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇవి కుడా చదవండి:సంపన్నులతో డేటింగ్ చేస్తూ, లక్షలు ఆర్జిస్తున్నాడు

English summary

Nava Yuva Samrat Akkineni Naga Chaitanya's New film Sahasam Sasaga Sagipo movie trailer was released by the movie unit yesterday. This movie was directed by Gautam Menon and this movie was going to release soon.