ఫ్యాషన్ మ్యాగజైన్ ఎడిటర్ గా మెగా మేనల్లుడు

Sai Dharam Tej is acting in Fashion Magazine editor role

02:58 PM ON 27th August, 2016 By Mirchi Vilas

Sai Dharam Tej is acting in Fashion Magazine editor role

సినిమాల్లో నిలదొక్కుకోవాలంటే కాస్తంత ఓపిక, శ్రమ కావాలి. రాత్రికి రాత్రే ఏమీ వచ్చేయవు కదా. అందుకే సాయిధరమ్ తేజ్ 'తిక్క' సినిమా ఫ్లాపుతో చాలా ఫీలైనా వాస్తవాన్ని వంటబట్టించుకున్నాడు. అందుకే ఆ తరువాత మీడియాలో ఎక్కడా కూడా కనిపించలేదు. ఓన్లీ చిరంజీవి 61వ బర్త్ డే వేడుకల్లో మాత్రం మెరిశాడు. ఈ తిక్క హీరో కొత్త సినిమా ఈరోజు ప్రారంభం అయింది. గోపిచంద్ మలినేని డైరక్షన్ లో రూపొందనున్న ఈ సినిమా కాన్సెప్టు ఏంటి? అసలు మనోడు ఎటువంటి పాత్రను పోషిస్తున్నాడు వంటి వివరాల్లోకి వెళ్తే.. ఇప్పటికే కొత్త హెయిర్ స్టయిల్ తో కనిపిస్తున్న సాయిధరమ్ తేజ్.. ఆ లుక్కును ముంబయ్ లో డిజైన్ చేయించాడట.

ఒక ప్రముఖ సెలూన్, అలాగే పాపులర్ హెయిర్ స్టయిలిస్ట్ మనోడి లుక్ ను డిజైన్ చేశాడట. ఇకపోతే ఈ సినిమాలో సాయిధరమ్ ఒక ఫ్యాషన్ డిజైనింగ్ మ్యాగజైన్ కు ఎడిటర్ గా పనిచేస్తున్నాడట. అందుకే తను కూడా చాలా ఫ్యాషనబుల్ గా కనిపించాలని మెగా మేనల్లుడు చాలా కేర్ తీసుకుంటున్నాడని అంటున్నారు. ఇప్పటికే ఒక సినిమా మ్యాగజైన్ ను సొంతంగా నడిపిన అల్లు శిరీష్ దగ్గర నుండి టిప్స్ తీసుకున్న తేజ్.. వేరే ఇతర ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ ఎడిటర్ల దగ్గర నుండి కూడా అనేక టిప్స్ తీసుకున్నారట. గోపిచంద్ మలినేని ఈ సినిమాను ఒక రొమాంటిక్ ఎంటర్టయినర్ గా మలుస్తున్నాడని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: మహంకాళి ఆలయంలో సింధు సందడి(ఫోటోలు)

ఇది కూడా చదవండి: 300 ఏళ్లనాటి రాజునంటూ భారీ మోసం..

ఇది కూడా చదవండి: పుట్టబోయే పిల్లలు తెలివిగా, ఆరోగ్యంగా పుట్టాలంటే ఏం చెయ్యాలి?

English summary

Sai Dharam Tej is acting in Fashion Magazine editor role