సాయిధరమ్-కల్యాణ్ రామ్ తో మల్టీస్టారర్!!

Sai Dharam Tej-Kalyan Ram multistarrer

01:21 PM ON 3rd February, 2016 By Mirchi Vilas

Sai Dharam Tej-Kalyan Ram multistarrer

మెగా స్టార్ కుటుంబానికి, నందమూరి కుటుంబానికి మధ్య గతంలో గొడవలు అయ్యాయని వార్తలు వినపడ్డాయి. అయితే ఈ రెండు కుటుంబాల్లో హీరోలు కలిసి ఒక సినిమా లో నటిస్తే నిజంగా పండగే అని భావించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు అది నిజం కాబోతుంది. అవును ఆ అసాధ్యం, సాధ్యం కాబోతోంది. సాయి ధరమ్ తేజ్ తో 'పిల్లా నువ్వు లేని జీవితం' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు ఎఎస్ రవికుమార్ చౌదరి ఈ సాహసం చేయబోతున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఈ దర్శకుడు ఇటీవలే ఇద్దరి హీరోలకు సరిపడే ఒక వినూత్నమైన కథను రాసుకున్నట్లు సమాచారం.

ఈ కథను రవికుమార్ చౌదరి ముందుగా సాయి ధరమ్ తేజ్ కు వినిపించాడట, కథ నచ్చడంతో సాయి ధరమ్ వెంటనే ఓకే చెప్పేసాడట. తన మొట్టమొదటి సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’ తీసి తనకు సూపర్ హిట్ అందించిన కృతజ్ఞతతో సాయి ధరమ్ తేజ్ రవికుమార్ చౌదరి కథకు వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. సాయి ధరమ్ ఓకే చెప్పడంతో రవికుమార్ ఈ కథను కళ్యాణ్ రామ్ కి కూడా వినిపించాడట. కథ నచ్చడంతో కల్యాణ్ రామ్ ఈ మల్టీ స్టారర్ చెయ్యడానికి ఇష్టంగా ఉన్నట్లు తెలుస్తుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ చిత్రం పట్టాలు ఎక్కడం ఖాయం. ఈ విషయాన్ని త్వరలోనే తెలియజేస్తారు.

English summary

Supreme hero Sai Dharam Tej and Nandamuri Kalyan Ram is acting in a multistarrer movie. This movie is directing by A.S. Ravikumar Chowdary.