బ్రేకింగ్ న్యూస్: టాప్ హీరోయిన్ వాలెట్ లో.. యంగ్ మెగా హీరో!

Sai Dharam Tej Photo In Rakul Preeth Singh Wallet

01:30 PM ON 28th November, 2016 By Mirchi Vilas

Sai Dharam Tej Photo In Rakul Preeth Singh Wallet

అది బాలీవుడ్ అయినా , టాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా సరే, ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమకు వస్తున్న హీరోయిన్లు హ్యాండ్ సమ్ గా ఉండి, మంచి బ్యాక్ గ్రౌండ్ హీరోలతో లవ్ లో పడిపోయి, ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లడం చూస్తున్నాం. తాజాగా, టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఒక రూమర్ వింటూ.. మరో ఘటన రిపీట్ కాబోతుందా అని టాలీవుడ్ జనాలు తెగ గుసగుసలాడుకుంటున్నారు.

ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ వాలెట్ లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఫొటో దర్శనమివ్వడమే ఇందుకు కారణమని అంటున్నారు. ఈ విషయం తాజాగా బయటకు వచ్చింది. ఈ హీరోహీరోయిన్లిద్దరూ గోపిచంద్ మలినేని చిత్రం ‘విన్నర్’లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం విదేశాల్లో జరుగుతోంది. దీన్లో భాగంగా ఈ జంటపై ఒక పాట కూడా షూట్ చేశారట.

ఈ పాటలో ఈ జంట మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవడం, దాంతో ఇద్దరి మధ్య క్లోజ్ నెస్ పెరిగిందట. ఇప్పుడు ఇండస్ట్రీలో దీని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారట. అయితే, కావాలని చేశాడో లేక యాధృచ్ఛికంగా జరిగిందో తెలియదు కానీ, దర్శకుడు మలినేని పాట షూటింగ్ సమయంలో రకుల్ వాలెట్ ను పరిశీలించాడట.

దాంట్లో సాయి ధరమ్ ఫొటో ఉండడంతో మలినేని షాక్ తిన్నాడట. దీంతో ఈ విషయాన్ని దర్శకుడు హీరోగారికి చెప్పడంతో, అతగాడు విషయాన్ని రహస్యంగా డీల్ చేయకుండా చిత్రబృందం ముందు పెట్టేశాడట. అయితే, రకుల్ తగిన వివరణ ఇవ్వడంతో అంతా కూల్ అయ్యారట. ఈ విషయం అలా ఇలా.. ఫిలింనగర్ చేరడంతో ఇండస్ట్రీకి చెందిన పెద్దాచిన్నా అందరూ మాట్లాడుకుంటున్నారట. దీంతో ఫిలింనగర్ లో హాట్ టాపిక్ అయింది.

ఇవి కూడా చదవండి:రాజుగారి గదిపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు

ఇవి కూడా చదవండి:అందాలు ఆరబోసి... అమ్మేస్తోంది

English summary

Young Hero Sai Dharam Tej and Tollywood Top Heroine Rakul Preeth Sing were acting in a movie named Winner and recently a news gone viral that Sai Dharam Tej's photo was caught in Rekul preeth Singh's wallet.