రెజీనాని పెళ్ళి చేసుకోనున్న మెగాహీరో

Sai Dharam Tej To Marry Regina

11:27 AM ON 4th March, 2016 By Mirchi Vilas

Sai Dharam Tej To Marry Regina

'ఎస్‌ఎమ్‌ఎస్‌' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రెజీనా ఆ తరువాత రొటీన్‌ లవ్‌స్టోరీ, కొత్తజంట, రారా కృష్ణయ్య, పవర్‌ వంటి సినిమాల్లో నటించింది. అయితే 2014 లో మెగా మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్‌ హీరోగా పరిచయమైన 'పిల్లా నువ్వులేని జీవితం' చిత్రంలో సాయి ధరమ్‌ సరసన రెజీనా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం విజయం సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్‌లో మళ్లీ రిపీట్‌ అయింది. ఆ తరువాత 2015లో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన 'సుబ్రమణ్యం ఫర్‌సేల్‌' చిత్రంలో కూడా రెజీనా హీరోయిన్‌గా నటించింది. ఈ రెండు చిత్రాలతో వీరిద్దరి మధ్య స్నేహం బాగా పెరిగింది. కొన్ని వేడుకల్లో కూడా వీరిద్దరూ కలిసి కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు హల్‌చల్‌ చేశాయి.

ఈ వార్తలని బలోపేతం చేసేలా తాజాగా సాయి ధరమ్‌ తేజ్‌-గోపిచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న చిత్రానికి రెజీనానే హీరోయిన్‌గా కావాలని రికమండ్‌ చేశాడట. ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అసలు విషయంలోకి వస్తే ప్రస్తుతం సాయిధరమ్‌ తేజ్‌-రెజీనా డీప్‌ లవ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు సాయిధరమ్‌ తేజ్‌ రెజీనా ని తన తల్లి దగ్గరకి తీసుకెళ్లి ఆశీర్వాదం ఇప్పించబోతున్నాడట. సాయి రెజీనా వచ్చే సంవత్సరంలో పెళ్ళి చేసుకుని తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడట. అయితే ఇందులో ట్విస్ట్‌ ఏంటంటే ఈ ప్రపోజల్‌ని రెజీనా రిజెక్ట్‌ చేసిందట.ఎందుకంటే రెజీనా ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలతో దూసుకు పోతుంది. ఇలాంటప్పుడు తనకి ఇప్పట్లో పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన లేదట. అయితే వీరిద్దరి రిలేషన్‌ పెళ్ళి వరకు వెళ్తుంతో లేక స్నేహంతోనే ఆగిపోతుందో కాలమే నిర్ణయించాలి.

English summary

Tollywood Young Hero Sai Dharam Tej and Regina together acted in two movies like Pilla Nuvvu Leni Jeevitam and Subrabnyam For Sale Movies.These two movies were become super hit at the box office and now Sai Dharam tej commotted to act under the direction of GopiChand Malineni.For Gopi Chand Malineni Movie Sai Dharam Tej Recommended Regina As Heroine.Recently a news came to know that Sai Dharam Tej and Regina were in Deep love and Sai Dharam bought a marriage proposal and they going to marry on Next year.