రాశీఖన్నా నా భార్యైతే అదృష్టమే అన్న సాయి ధరమ్ తేజ్

Sai Dharam Teja and Rashi Khanna in love

11:43 AM ON 14th June, 2016 By Mirchi Vilas

Sai Dharam Teja and Rashi Khanna in love

యంగ్ హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కుదిరితే భలే రంజుగా వుంటుంది. దీనికి అనేక నిదర్శనాలు కనిపిస్తాయి. ముఖ్యంగా సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా ఇద్దరూ ఒకరిని ఒకరు తెగ మోసేసుకోవడం కూడా అలాంటిదేనట. మామూలుగా సాయితో ఫ్రెండ్ షిప్ అంటే ఇండస్ట్రీలో అంతా ఇష్టపడతారు. ఎందుకంటే అతనిలో మెగా పొగరు అస్సలు కనిపించదట. చాలా నార్మల్ మనిషిగా, ప్రతి వ్యక్తితో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కలిసిపోతాడు. ఏ యాంగిల్ లో కూడా హీరో అనే ఫీలింగ్ అతనిలో కనిపించకపోవడం సాయి గొప్పతనం. ఆ మంచితనం చూసే హీరోయిన్స్ బాగా ఫ్లాట్ అవుతుంటారు.

ఇంతకు ముందు సాయి, రెజీనా ఇద్దరూ డేటింగ్ చేశారనే రూమర్స్ వినిపించాయి. ప్రేమ కూడా పాకానికి వచ్చిందని కూడా అన్నారు. కానీ అవన్నీ ఇప్పుడు కామ్ అయిపోయాయి. కానీ సాయి-రాశీఖన్నా ఇద్దరూ దగ్గరవుతున్నారని టాక్. ఇక ఒక పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇద్దరూ తెగ మోసేసుకున్నారు. ఇక రాశీఖన్నా లాంటి భార్య దొరికితే అదృష్టం. చాలా అడ్జెస్టబుల్. పరిస్థితులను అర్ధం చేసుకుంటుంది. అమ్మ కూచి. ఆమెను చేసుకుంటే మంచి భార్య కూడా అవుతుందని తెగ మోశాడు. రాశీకి మా నాన్నతో కూడా మంచి ఎటాచ్ మెంట్ ఉందని సిగ్నల్ ఇచ్చాడు.

కొంపదీసి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని ఆయనకు కూడా తెలిసిందేమోనని టాక్. ఇటు రాశీఖన్నా కూడా సాయి ధరమ్ తేజ్ ను ఫ్లర్ట్ చేసింది. సాయి ధరమ్ కి వాళ్లమ్మంటే చాలా ఇష్టం. అమ్మను ఎప్పుడూ వదిలిపెట్టడు. అమ్మను బాగా చూసుకునే ప్రతీ వ్యక్తి భార్యను బాగా చూసుకుంటాడు. నాకైతే సాయి లాంటి భర్త దొరికితే అదృష్టమేనని చంకలు గుద్దుకుంటోంది. ఇలా మొహమాటం లేకుండా మాట్లాడిన వీళ్లిద్దరూ రియల్ లైఫ్ లో లవ్ లో ఉన్నారని ఎవ్వరికైనా అనిపిస్తోంది. ఈమధ్య సుప్రీమ్ సక్సెస్ ని కూడా ఇద్దరే సెలబ్రేట్ ని చేసుకున్నారట. మరి వాళ్లిద్దరి మధ్య లవ్ ఉందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.

ఈమధ్య యంగ్ హీరో హీరోయిన్లు లవ్ లో పడడం మామూలైపోయింది. మరి వీరిద్దరి మధ్య సాగుతున్న తతంగం కూడా లవ్వే అయితే, త్వరలోనే బహిర్గతం కూడా అవుతుందనడంలో సందేహం లేదు.

English summary

Sai Dharam Teja and Rashi Khanna in love