కారులో కూర్చుని ఏడ్చేసిన సాయి.. కారణం ఇదే!

Sai Dharam Teja cried in car

12:36 PM ON 13th August, 2016 By Mirchi Vilas

Sai Dharam Teja cried in car

మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంతటి పెద్ద స్టార్ హీరోల మేనల్లుడుగా సినీ రంగప్రవేశం చేశారు సాయి ధరమ్ తేజ్. అయితే ఇంతటి స్టార్ హీరోల మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కి ఏడవాల్సిన అవసరం ఏంటీ? అతనికి అంత కష్టం ఏమొచ్చింది? అని ఆలోచేస్తున్నారా? అయితే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.. స్వశక్తితో సంపాదించిన రూపాయి మాత్రమే నాది అని ఆలోచించే వ్యక్తిత్వం గలవాడు సాయి ధరమ్ తేజ్. అయితే యంగ్ హీరోలు కాకముందు ఎలా వుంటారో మనకు తెలియదు. అయితే సినిమాల్లోకి రాకముందు సాయి ధరమ్ తేజ్ తన ఎదుర్కొన్న పరిస్థితిని ఒకటి మీడియా సమావేశంలో వివరించాడు.

'రేయ్' సినిమా సమయంలో సాయి దగ్గర ఒక్క రూపాయి కూడా లేదట. కేవలం 30 వేలు ఉంటే, అవి ఫిట్నెస్ ట్రైనర్ కి ఇవ్వాల్సి వచ్చిందట. ఇంట్లో అడుగుదాం అనుకున్నా అందుకు తన మనసు నిరాకరించడంతో ఎలాగోలా ఎరేంజ్ చేసుకుందాం అని అనుకున్నాడట. అయితే రేయ్ సినిమాకి సంబంధించిన చిన్న మీటింగ్ కోసం వెళ్లే సమయంలో కారులో పెట్రోల్ కొట్టించడానికి చూస్తే తన దగ్గర డబ్బులు లేవట. అసలు ఏంటీ పరిస్థితి అని తల పట్టుకుని ఏడుస్తున్న సమయంలో తన అకౌంట్ లో 2 లక్షలు క్రెడిట్ అయినట్లు మెసేజ్ రావడంతో కంగారుపడి ఇంటికి ఫోన్ చేసాడట సాయి.

ఫోన్ ఎత్తగానే నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటున్నావా? నేనే వేసాను అని అమ్మ వాయిస్ వినగానే సాయి కారులోనే ఏడ్చేశాడట. డబ్బు విలువ తెలిసిన వాడు కాబట్టే అంతలా ఒదిగి మరీ నటిస్తూ, విజయాల్ని ఆస్వాదిస్తున్నాడు అంటూ ఇండస్ట్రీ సాయి పై మంచి టాక్ ఏ నడుస్తుంది. ఇదిలా ఉంటే సాయి నటించిన తిక్క సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరో విజయం తన ఖాతాలో చేరాలని కోరుకుందాం..

English summary

Sai Dharam Teja cried in car