సాయికుమార్ పై చేయి చేసుకున్న ఎన్టీఆర్!

Sai Kumar talks about senior NTR

11:58 AM ON 23rd September, 2016 By Mirchi Vilas

Sai Kumar talks about senior NTR

నటుడు సాయికుమార్ విలక్షణ నటుడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా ఎన్నో పాత్రలు వేయడమే కాదు, ఎంతోమంది నటులకు గాత్రం అందించాడు. సుమన్, రాజశేఖర్ ఇలా చాలామందికి సాయికుమార్ డబ్బింగ్ చెప్పాడు. తాజాగా జనతా గ్యారేజ్ లో నటించిన సాయి ఇటీవల హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన జనతా గ్యారేజ్ సక్సెస్ మీట్ లో మాట్లాడాడు. తన డబ్బింగ్ జీవితం సీనియర్ ఎన్టీఆర్ సినిమాతోనే మొదలయిందని, ఆయన కుటుంబంలో దాదాపు అందరితో నటించే అదృష్టం తనకి దక్కిందని సినీనటుడు సాయికుమార్ అన్నారు. నా మొదటి డబ్బింగ్ సినిమా సీనియర్ ఎన్టీఆర్ గారితో చేశా.

బాలయ్య బాబుతో రౌడి ఇన్స్పెక్టర్, సీమసింహం, కళ్యాణరామ్ తో పటాస్, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ సినిమాలలో నటించా. అలా కుటుంబంలోని దాదాపు అందరి సినిమాలలో నటించా. జనతా గ్యారేజ్ లో చాలామంది గొప్ప నటుల మధ్య నటించడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన కొరటాల శివగారికి థ్యాంక్స్. నాకు తారక్ తో సినిమా చేస్తున్నప్పుడు మళ్లీ ఆ పెద్దాయనతో చేస్తున్న అనుభూతి కలిగింది అని సాయికుమార్ చెప్పుకొచ్చాడు. ఇక మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఆయనతో కలిసి నటించడమే కాదు, దెబ్బలు కూడా తిన్నాను అని చెప్పాడు. జనతా గ్యారేజ్ వంద కోట్ల సినిమా అని నేను తారక్ తో అన్నాను. అది నిజమవుతున్నందుకు ఆనందంగా ఉంది.

పోలీస్ స్టోరీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నాకు ఎంత పేరొచ్చిందో, ఒక డిగ్నిఫైడ్ పోలీస్ ఆఫీసర్ గా నాకు జనతా గ్యారేజ్ లో పేరొచ్చింది. దానికి కారణం ఏంటంటే నాకు పోలీసులు చాలా మంది అభిమానులున్నారు. టాప్ ర్యాంక్ నుంచి కింద ర్యాంక్ వరకు. నా పోలీస్ స్టోరీ చూసి ప్రభావితమై పోలీసులైన చాలా మంది వ్యక్తులున్నారు అంటూ సాయికుమార్ తన అనుభవాలను పంచుకున్నారు.

ఇది కూడా చదవండి: మరో అద్భుతానికి తెర తీసిన శాస్త్రవేత్తలు.. ఈసారి గాలి, నీరే ఇంధనం!

ఇది కూడా చదవండి: చిన్నారుల ఆరోగ్యం కోసం జుకర్ బర్గ్ భార్య 20 వేల కోట్లు సాయం(వీడియో)

ఇది కూడా చదవండి: 'మజ్ను' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

English summary

Sai Kumar talks about senior NTR. Sai Kumar talks about senior Ntr and old memories. Sai Kumar said that Ntr sir beats me in Major ChandraKanth movie shooting.