పనామా పత్రాల్లో సైఫ్ , కరీనా

Saif Ali Khan And Kareena Names In Panama Papers List

05:21 PM ON 7th April, 2016 By Mirchi Vilas

Saif Ali Khan And Kareena Names In Panama Papers List

ప్రపంచవ్యాప్తంగా దేశదేశాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న పనామా పత్రాల్లో మరికొందరి భారతీయ ప్రముఖుల జాతకాలు బట్టబయలు అయ్యాయి. నల్లదనం దాచుకోవడానికి సంబంధించి, ఇప్పటికే బాలీవుడి దిగ్గజం బిగ్ బి , ఐశ్వర్య రాయ్ పేర్లు వున్నట్లు వెల్లడికాగా , తాజాగా పనామా పత్రాల్లో బాలీవుడ్‌ జంట సైఫ్‌ అలీఖాన్‌, కరీనా కపూర్‌ దంపతుల పేర్లు వెలుగు చూసాయి. దీంతో మరింత సంచలనంగా మారింది. 2010లో ఐపీఎల్‌ బిడ్డింగుల్లో భాగంగా బ్రిటిష్‌ వర్జిన్‌ ఐల్యాండ్స్‌లో నమోదైన నకిలీ సంస్థలో వీరు భాగస్వాములుగా ఉన్నట్లు వెల్లడైంది.

ఇవి కూడా చదవండి :చెల్లిని గర్భవతిని చేసిన అన్న

2010 మార్చిలో 10 మంది సభ్యులతో పి-విజన్‌ స్పోర్ట్స్‌ లిమిటెడ్‌ పేరుతో ఓ సంస్థ ఏర్పాటైంది. ఈ సంస్థలో సైప్‌ అలీఖాన్‌, అతడి భార్య కరీనా కపూర్‌, కరీనా సోదరి కరిష్మా కపూర్‌కు వాటాలున్నట్లు తాజా పత్రాలు బహిరంగం చేసాయి. సైఫ్‌కు 9 శాతం, కరీనా, కరిష్మాకు చెరో 4.5 శాతం వాటాలున్నట్లు పనామా పత్రాల ద్వారా తెలుస్తోంది. ఇదే సంస్థ కింద బ్రిటిష్‌ ఐల్యాండ్స్‌లో అబ్‌బురేట్‌ లిమిటెడ్‌ అనే మరో నకిలీ సంస్థను ఏర్పాటుచేసినట్లు తేలింది. మొత్తానికి పనామా కధ కంచికి చేరుతుందో ,ఇంకా ఎవరి బండారం బయట పెడుతుందో చూడాలి .....

ఇవి కూడా చదవండి :

ఎయిర్ హోస్టెస్ లు విమానంలో ఆ పనులు కుడా చేస్తారట

ఛీ ఛీ.. ఐఏఎస్ ఇంట్లో టీవీ తారల వ్యభిచారం

7 నిమిషాల సుఖానికి 50 % ఎక్స్ ట్రా కాస్ట్

English summary

Bollywood Hero Saif Ali Khan , Kareena Kapoor And Karishma Kapoor Names were in the list of Panama Papers list which was ReleASed recently.