ఎక్స్ హోం మినిస్టర్ మనవడితో డేటింగ్

Saif Ali Khan Daughter Dating With Politician Grand Son

10:05 AM ON 7th May, 2016 By Mirchi Vilas

Saif Ali Khan Daughter Dating With Politician Grand Son

తాను ఒకటి తలస్తే , దైవం మరోటి తలచిందన్న చందంగా తయ్యారైంది బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పరిస్థితి. ఆయన కూతురు సరాఖాన్ అప్పుడే ప్రేమ పక్షిగా మారిపోయింది.తన తండ్రి లాగే బాలీవుడ్‌లో మంచి స్టార్‌గా సరా ఎదుగుతుందని అంతా ఊహించారు. పైగా అలియా భట్ కెరీర్‌ని చక్కని మలుపు తిప్పిన కరణ్ జోహార్ కూడా ఆమె కెరీర్‌కి పునాది వేసి ఆమెను మంచి నటిగా తీర్చిదిద్దాలనుకున్నాడట. అయితే అమ్మడు మాత్రం ఆ మాట పక్కన పెట్టి.. రొమాన్స్ బాట పట్టింది. ఓ టాప్ పొలిటిషియన్‌కు వరసకు మనవడైన ఓ కుర్రాడితో లవ్వులో పడినట్టు కనిపిస్తోంది. అతనితో డేటింగ్ చేస్తోందట.

ఇవి కూడా చదవండి:వర్మపై పగబట్టిన హీరోయిన్ ఎవరు?

ఆ పొలిటిషియన్ మరెవరో కాదు.. మాజీ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేయేనని, వీర్ పహారియా అనే ఆ కుర్రాడు దుబాయ్‌లో చదువుకున్నాడని ముంబై మిర్రర్ పత్రిక తెలిపింది.పాప్‌స్టార్ కావాలనుకుంటున్న వీర్‌కి, సరాకి ఎలా పరిచయం కలిగిందో గానీ కొంత కాలంగా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని తెలిసింది. వీళ్ల ఫోటోలు రచ్చకెక్కాయి కూడా..వీర్‌తో డేటింగ్ చేస్తున్నావా అని అడిగితే.. సరా.. భలే సమాధానమిచ్చింది. ఈ విషయాన్ని అతడ్నే అడగండి..రోడ్డు పక్కన బండిలో అమ్మే దోసె తినడానికైనా వీర్ వెనుకాడడు..అతను సూపర్ సెన్సిటివ్.. ఏ అమ్మాయి అయినా అతనితో సరదాగా బీచ్‌లో తిరగాలని అనుకుంటుంది అని చెప్పిందట. టీనేజర్ లవ్వంటే ఇదే మరి అంటూ కామెంట్స్ మీద కామెంట్స్ వచ్చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:బ్రహ్మోత్సవం సాంగ్ మేకింగ్‌ ( వీడియో )

ఇవి కూడా చదవండి:ఉదయాన్నే ఉప్పునీరు తాగితే ఎంత లాభమో !

English summary

Bollywood Hero Saif Ali Khan's Daughter Sara Ali Khan was dating with Famous Politician Susheel Kumar Shinde's Grandson Veer. Recently the photos of these two were leaked in internet and going viral over the Social Media.