స్టార్ హీరో కూతురు ఫోటోలు చూస్తే దిమ్మతిరగాల్సిందే(ఫోటోలు)

Saif Ali Khan daughter Sara Khan photos

02:06 PM ON 23rd September, 2016 By Mirchi Vilas

Saif Ali Khan daughter Sara Khan photos

పూర్వం ఏదైనా నట్టింట్లో దాటేది కాదు. ఇప్పుడు ఏ చిన్న విషయం అయినా సరే క్షణాల్లో నెట్టింట్లోకి చేరిపోతోంది. మంచి చేదు అనే తేడా లేకుండా వుంది. ఇక సెలబ్రిటీల విషయం అయితే అస్సలు చెప్పక్కర్లేదు. ఇక ఓ ప్రముఖ హీరో కుమార్తె ఫోటోలు ఇప్పడు నెట్టింట్లో హల్ చల్ చేసేస్తున్నాయి. ఈ ఫోటోలు వైరల్ గా మారి వేలాది మంది వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అసలు ఈ భామ ఏ స్టార్ కుమార్తె.. ఎందుకు ఆ ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయన్న విషయం తెలియాలంటే ఇది చదవాల్సిందే. కరీనా కపూర్ పేరు చెబితే, సినీ జనాలకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. అందచందాలతో అభిమానులను మంత్ర ముగ్ధుల్ని చేసిన ఈ భామ ఇవాళ 36 వసంతంలోకి అడుగెట్టింది.

పుట్టిన రోజు వేడుకకు పలువురు ప్రముఖులతో పాటు నటీనటులు పాల్గొని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. అయితే ఈ పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్న సైఫ్ అలీఖాన్ మొదటి భార్య కుమార్తె సారా అలీఖాన్ అందరి దృష్టిని ఆకర్షిచింది. వేడుకకు స్పెషల్ అట్రాక్షన్ గా అయిపోయింది. ఇలా ఎందుకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయిందో వివరాల్లోకి వెళ్తే, సారా ధరించిన డ్రస్ అదిరిపోయింది. ఫంక్షన్ కు వచ్చిన వారంతా వేడుకను పట్టించుకోకుండా అందరి కళ్ళు ఆమెపైనే పడ్డాయట. ఇక ఆ ఫంక్షన్ కు వెళ్లిన మీడియా మిత్రులు తమ కెమెరాల్లో ఆమెను బంధించారు. అలా తీసిన ఫోటోలు ఇప్పడు ఇలా నెట్ లో వైరల్ గా మారాయి. వేలాది మంది వీక్షకులను ఈ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.

సారా త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందట. అంతే కాదండోయ్ ఈ అందాల అమ్మాయి 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2' సినిమాతోనే ఎంట్రీ ఇవ్వనుందని సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఈ విషయంపై అటు సైఫ్ గానీ సారా గానీ స్పందించకపోవడంతో ఎంట్రీ ఖరారైందన్న పుకారుకు మరింత బలం చేకూరుతోంది. ఒకసారి ఆ ఫోటోలుపై మీరు కూడా ఓ లుక్ వెయ్యండి.

1/8 Pages

English summary

Saif Ali Khan daughter Sara Khan photos. Saif Ali Khan's daughter Sara Khan's latest hot photos.