అర్ధరాత్రి కరీనాకు ఫోన్ చేసిన కుర్ర హీరో

Saif Ali Khan gave warning to Arjun Kapoor

11:20 AM ON 27th February, 2016 By Mirchi Vilas

Saif Ali Khan gave warning to Arjun Kapoor

అర్జున్‌ కపూర్‌-కరీనా కపూర్‌ జంటగా కలిసి నటించిన తాజా చిత్రం 'కీ అండ్‌ కా'. బల్కీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని ఇటీవలే విడుదల చేశారు. ఇందులో అర్జున్‌-కరీనా రెచ్చిపోయి మరి బెడ్‌రూమ్‌ సన్నివేశాల్లో నటించారు. ఇది చూసి పెళ్ళయ్యాక మీరు అటువంటి సన్నివేశాల్లో నటించనని చెప్పారు కదా అని కరీనాని అడిగితే సినిమా ఒప్పుకున్నాక డైరెక్టర్‌ ఏమి చెప్పితే అది చెయ్యాలని వేదాంతం మాట్లాడింది. ఇది చూసి సైఫ్‌ ఎలా స్పందిస్తాడో అని అందరూ ఎదురు చూస్తే కరీనా-అర్జున్‌ ల కెమిస్ట్రీ చాలా బాగుంది, కరీనా బాగా నటించిందని సైఫ్ కితాబులిచ్చాడు.

ఇది విన్న అందరూ ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉంటే తాజాగా సైఫ్‌ అలీఖాన్‌ అర్జున్‌ కపూర్‌ కి వార్నింగ్‌ ఇచ్చినట్లు బాలీవుడ్‌లో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అసలు విషయంలోకి వస్తే అర్జున్‌ కపూర్‌ అర్ధరాత్రి కరీనాకి ఫోన్‌ చేశాడట, ఆ ఫోన్‌ సైఫ్‌ లిఫ్ట్‌ చేశాడట. దీనితో సైఫ్‌ అర్జున్‌కి క్లాస్‌ పీకినట్లు సమాచారం. సీనియర్లకు గౌరవం ఇవ్వడం నేర్చుకో అంటూ వార్నింగ్‌ ఇచ్చాడని, దీనితో అర్జున్‌ భయపడి కామ్‌గా ఫోన్‌ పెట్టేశాడని సమాచారం. ఈ ఫోన్‌ తరువాత కరీనా-అర్జున్‌ల మధ్య మాటల యుద్ధం జరిగిందని ఇన్‌సైడ్‌ సమాచారం.

'కీ అండ్ కా' చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

1/13 Pages

'కీ అండ్ కా' ట్రైలర్

English summary

Saif Ali Khan gave warning to Arjun Kapoor for calling Kareena Kapoor at midnight. Arjun Kapoor and Kareena Kapoor were acting in Ki and Ka for first time.